sachin : సయామీ ఖేర్ ‘వైవిధ్య’ బౌలింగ్‌.. అద్భుతమన్న సచిన్‌.. వీడియో వైరల్!

క్రికెట్ దిగ్గజం సచిన్‌ను కలిసిన వీడియోను సినీనటి సయామీ ఖేర్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 23 Aug 2023 12:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్ (Sachin Tendulkar) ఎంతో మందికి స్ఫూర్తి. అతడికి అభిమానులు భారీ సంఖ్యలోనే ఉంటారు. వారిలో బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్ (Saiyami Kher) ఒకరు. చిన్నప్పటి నుంచి ఆరాధించిన సచిన్‌ తన సినిమాకు అభిమానిగా మారడంతో ఆమె ఆనందానికి ఆవధుల్లేవు. ఆమె నటనకు ప్రశంసలు కురిపించిన సచిన్‌..  ఆమె ఆటను స్వయంగా చూడాలనుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘అప్పుడు రోహిత్‌ను ధోని వద్దన్నాడు’

సయామీ ఖేర్‌ నటించిన ‘ఘూమర్‌’ (Ghoomer) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె సచిన్‌ను కలిశారు. ఆ వీడియోను ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పంచుకున్నారు. ‘చిన్నప్పటి నుంచి నేను ఆరాధించే వ్యక్తి సచిన్‌. ఆతడిని ఏదో ఒకరోజు కలవాలని కలలు కనేదాన్ని. నా కల ఇప్పుడు నెరవేరింది. నేను క్రికెట్ గ్రేట్‌ను కలిశాను. అతడి ఆటను చూసే నేను ఇష్టపడి క్రికెట్ నేర్చుకున్నాను. నా హీరో.. నా స్ఫూర్తి.. నా గురువు సచిన్‌ ’అని ఆమె ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది.

క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘ఘూమర్‌’ సినిమా ఆగస్టు 18న విడుదలైంది. ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, సయామీ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యభూమిక పోషించారు. ఈ సినిమాను సచిన్‌ సతీమణి అంజలితో కలిసి చూశాడు. ‘సయామీ నటన అద్భుతం. రీల్‌లో కాకుండా రియల్‌గా ఆమె బౌలింగ్‌ చూడాలని అనుకున్నాను. ఆమె ఎడమ చేతి బౌలింగ్ అద్భుతం’ అని సచిన్‌ ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. ఇక సయామీ.. క్రికెట్‌ ఆడిన రీల్స్‌ను తన ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు