ICC RANKINGS: వన్డేల్లో టీమ్‌ఇండియా ఆటగాళ్లే నంబర్‌వన్‌.. ఐసీసీ ర్యాంకులు విడుదల

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమ్‌ఇండియా (ICC) ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయారు. 

Published : 08 Nov 2023 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అగ్రస్థానాలను సాధించారు. బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ను గిల్ వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్‌ అజామ్‌ (824 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు. క్వింటన్ డికాక్‌ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో నిలిచారు. వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకపై 92 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో బాబర్‌ను గిల్ వెనక్కి నెట్టేశాడు. శ్రేయస్‌ అయ్యర్ కూడా 17స్థానాలను ఎగబాకి 18వ ర్యాంక్‌ను సాధించాడు. అఫ్గాన్‌ ఓపెనర్‌ జద్రాన్ ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని 12వ స్థానంలో నిలిచాడు.

దక్షిణాఫ్రికా, శ్రీలంకపై అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్ సిరాజ్‌ (709 పాయింట్లు) అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. అతడి వెనుకనే దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహరాజ్ (694) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో నిలకడగా వికెట్లు తీస్తున్న ఆసీస్‌ స్పిన్నర్ ఆడమ్ జంపా (662 పాయింట్లు) మూడో స్థానంలోఉండగా.. కుల్‌దీప్‌ (661), షహీన్‌ అఫ్రిది (658) నాలుగైదు ర్యాంకుల్లో నిలిచారు. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ శ్రీలంక పేసర్ మదుషంక 31 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబ్‌ అల్ హసన్‌ (327 పాయింట్లు) ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గాన్‌ మాజీ సారథి మహమ్మద్ నబీ (287), రషీద్ ఖాన్ (263) తర్వాతి స్థానాల్లో నిలిచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని