SA vs IND: సఫారీలతో తొలి టీ20 వర్షార్పణం.. టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దు

దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయింది.

Published : 10 Dec 2023 21:33 IST

డర్బన్: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్‌ (SA vs IND) మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయింది. టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. టాస్ వేయడానికి నిర్దేశించిన సమయాని కంటే ముందు నుంచే కింగ్స్‌మీడ్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఓవర్లు కుదించి మ్యాచ్‌ నిర్వహించాలని భావించినా వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 మంగళవారం కెబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని