IPL 2023: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు..

తెలుగువారి ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SunRisers Hyderabad) పగ్గాలను మరోసారి విదేశీ ఆటగాడికే అప్పగించారు. ఈ సీజన్‌కు ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌గా మార్‌క్రమ్‌ను ప్రకటించారు.

Published : 23 Feb 2023 11:51 IST

హైదరాబాద్‌: ఐపీఎల్‌ (IPL) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. ఆ జట్టు పగ్గాలను దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఏడెన్‌ మార్‌క్రమ్‌ (Aiden Markram)కు అప్పగించారు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ జట్టు గురువారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. 

సన్‌రైజర్స్‌ (SRH) జట్టుకు విదేశీ ఆటగాళ్లు నాయకత్వం వహించడం కొత్తేం కాదు. గతంలో కొన్నేళ్ల పాటు డేవిడ్‌ వార్నర్‌, ఆపై కేన్‌ విలియమ్సన్‌ నడిపించారు. మధ్యలో కొన్ని సార్లు భువనేశ్వర్‌ కుమార్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించినా అది తాత్కాలికమే. అయితే ఇప్పడు వార్నర్ (David Warner)‌, విలియమ్సన్‌ (kane williamson) ఇద్దరూ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వార్నర్‌ గత సీజన్లోనే సన్‌రైజర్స్‌ను వీడగా.. ఈ సీజన్‌కు ముందు విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ విడిచిపెట్టింది. దీంతో జట్టు కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మార్‌క్రమ్‌ లేదా టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం మార్‌క్రమ్‌కు అవకాశమిచ్చింది.

సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన అనుబంధ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ జట్టుకు కూడా మార్‌క్రమ్‌ సారథ్యం వహించాడు. ఇటీవల జరిగిన ఎస్‌ఏ20 (దక్షిణాఫ్రికా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్‌ టోర్నీ) టోర్నీలో మారక్రమ్‌ జట్టు విజేతగా నిలిచింది. దీంతో హైదరాబాద్‌ (SRH) పగ్గాలను కూడా అతడికే అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని