ICC: శ్రీలంక క్రికెట్‌పై ఐసీసీ నిషేధం ఎత్తివేత

గతేడాది నవంబర్‌లో శ్రీలంక క్రికెట్‌బోర్డుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

Published : 28 Jan 2024 21:21 IST

దుబాయి: శ్రీలంక క్రికెట్‌కు ఐసీసీ (ICC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆ దేశ క్రికెట్‌(SLC) సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆదివారం తెలిపింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని, మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌(SLC) స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ  గతేడాది నవంబర్‌లో ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, సస్పెన్షన్‌ విధించినప్పటి నుంచి పరిస్థితులను పర్యవేక్షించిన ఐసీసీ.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడల మంత్రి హరిన్‌ ఫెర్నాండో ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు