Steve Smith: సూపర్‌ మ్యాన్‌లా స్మిత్‌.. క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ చూస్తారా?

విశాఖ వన్డే (Vizag ODI)కే హైలైట్‌గా నిలిచిందా క్యాచ్‌. అద్భుత రీతిలో స్మిత్‌ (Steve Smith ) పట్టిన ఆ క్యాచ్‌ ‘క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా ప్రశంసలు అందుకుంటోంది.

Published : 20 Mar 2023 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాఖపట్నం వన్డే (IND vs AUS 2nd ODI)లో ఆస్ట్రేలియా (Australia) అన్ని విభాగాల్లోనూ రాణించింది. తొలుత బంతితో, ఆ తర్వాత బ్యాట్‌తో అదరగొట్టిన ఆసీస్‌.. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith ) ఒంటి చేత్తో ఒడిసిపట్టిన క్యాచ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరినీ ఔరా అనిపించేలా అతడు ఆ క్యాచ్‌ పట్టిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా కొంతమంది దాన్ని అభివర్ణిస్తున్నారు.

పదో ఓవర్లో సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో హర్దిక్‌ పాండ్య షాట్‌ ఆడబోతే.. బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి ఫస్ట్‌ స్లిప్‌కి కాస్త దూరంగా వెళ్లింది. బంతికి ఏమాత్రం దగ్గరగా లేని స్మిత్‌ అమాంతం కుడివైపునకు ఎగిరి సూపర్‌మ్యాన్‌ తరహాలో ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టుకున్నాడు. స్మిత్‌ ఫీల్డింగ్‌ విన్యాసాన్ని చూసి ఆటు కామెంటేటర్లతోపాటు.. ఇటు డ్రెస్సింగ్‌ రూమ్‌లోని రోహిత్‌ శర్మ సహా టీమ్‌ఇండియా ఆటగాళ్లూ ఆశ్చర్యానికి గురయ్యారు. కామెంటరీ బాక్స్‌ నుంచి సంజయ్‌ మంజ్రేకర్‌.. దీన్ని క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీగా పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌.. భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వన్డే చెన్నై వేదికగా జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని