Kuldeep - Siraj: మ్యాజిక్‌లా అనిపించింది.. ఆసియా కప్ హీరోలు కుల్‌దీప్- సిరాజ్ స్పెషల్ చిట్‌చాట్!
టీమ్‌ఇండియా పేసర్ సిరాజ్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ పోటాపోటీగా వికెట్లు తీసి భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్ తర్వాత వీరిద్దరూ ప్రత్యేకంగా సంభాషించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ను (Asia Cup 2023) భారత్ సొంతం చేసుకోవడంలో బౌలర్లు మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. శ్రీలంకపై ఫైనల్‌లో ఆరు వికెట్లు తీసిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా.. కుల్‌దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో సిరాజ్ 10 వికెట్లు, కుల్‌దీప్ 9 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ స్పెషల్‌గా చిట్‌చాట్ చేశారు. ఆ వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.
కుల్‌దీప్: సిరాజ్ ఈరోజు నువ్వు అద్భుతంగా బౌలింగ్ చేశావ్? ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నావ్?
సిరాజ్: నిజంగా ఈరోజు నా బౌలింగ్ ఒక మ్యాజిక్‌లా అనిపించింది. ఇలా జరుగుతుందని నేనూ ఊహించలేదు.
కుల్‌దీప్: ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశావ్ కదా.. ఎలాంటి ప్లాన్‌తో ముందుకెళ్లావ్?
సిరాజ్: బౌలింగ్ మొదలుపెట్టినప్పుడు స్వింగ్ అవుతున్నట్లు తెలిసిపోయింది. దీంతో నేరుగా వికెట్లకు వేయాల్సిన అవసరం లేదని అనిపించింది. ఒకే దగ్గర బంతులు విసిరితే చాలనిపించింది. అలాగే ప్లాన్ చేసుకున్నాను.
కుల్‌దీప్: శానకను ఔట్ చేసిన బంతి చాలా బాగా సంధించావ్. దాన్నెలా ప్లాన్ చేశావ్?
సిరాజ్: ఇప్పటి వరకు నేను తీసిన వికెట్లలో ఇదే నా ఫేవరెట్. ఇలాంటి ‘అవుట్ ఆఫ్ ది క్రీజ్’ ఔట్‌స్వింగ్ బంతుల్ని నేను వెస్టిండీస్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను. ఈరోజు ఆటలో అలాంటి బంతుల్ని సంధించాలనుకొని ప్లాన్ చేసుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో.. దాన్ని పక్కాగా అమలు చేయగలిగాను. అది వర్కౌట్ అయ్యింది.
కుల్‌దీప్: ఆసియా కప్‌లో కొత్త బౌలింగ్ (6/21) రికార్డును నెలకొల్పావు. దీనిపై టీమ్ కూడా చాలా గర్వంగా ఉంది.
సిరాజ్: నాకు నిజంగా ఇదొక గొప్ప మైలురాయి. ఫైనల్‌లో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం నాకూ ఆనందంగా ఉంది. ప్రపంచ కప్‌నకు ముందు ఇది నాలో ఆత్మవిశ్వాసం నింపుతుంది.
కుల్‌దీప్‌ను సిరాజ్ ప్రశ్నించాడిలా...
సిరాజ్: ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన నువ్వు.. ఈ టోర్నమెంట్‌లో ఓ రిథమ్‌తో ముందుకెళ్లావ్. దానికోసం ఎలా ప్లాన్ చేసుకున్నావ్?
కుల్‌దీప్: అందరిలాగే నేనూ వికెట్లను అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాను. గుడ్‌లెంగ్త్‌తో అక్కడే బంతుల్ని సంధించాలనుకున్నాను. బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్‌ను ఎలా ఆడుతున్నారో కూడా గమనిస్తూ ముందుకెళ్లా.
సిరాజ్: గత కొంతకాలంగా నేను నీతో కలిసి ప్రయాణం చేస్తున్నా. బంతిని వదిలే సమయంలో చూపించే వేరియేషన్.. అదెలా సాధ్యమవుతుంది?
కుల్‌దీప్: ఏడాదిన్నరగా నేను దీనిపై తీవ్ర కసరత్తు చేస్తున్నా. మొత్తానికి రిథమ్ పట్టుకోగలిగా. దాన్ని అలా కొనసాగిస్తున్నాను. ఇప్పుడు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
సిరాజ్: రెండు మ్యాచుల్లో అసలు బౌలింగ్ వేయడానికి అవకాశమే రాలేదు. మూడు మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు తీశావ్? ఎలా అనిపించింది?
కుల్‌దీప్: చివరి మ్యాచ్‌లో నీ ఆటతీరు చూసిన తర్వాత నేను చాలా సంతోషించా. ఇలాంటి మ్యాచ్‌లలో అవకాశం వచ్చిందా? లేదా? పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం టీమ్‌గా చూస్తే ఒక జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది (నవ్వుతూ). నువ్వు మ్యాచుల్లో వికెట్లు తీసినప్పుడు సెలబ్రేట్ చేసుకునే తీరు కూడా నాకు చాలా నచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా