Rohit Sharma: సారథిగా.. ధోనీ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో...

Published : 29 Sep 2022 13:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ‘కెప్టెన్‌ కూల్’ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఒకే ఏడాదిలో అత్యధిక టీ20ల్లో టీమ్‌ఇండియాను విజేతగా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ధోనీ నాయకత్వాన భారత్‌ 2016లో 15 టీ20ల్లో ఛేదించి విజయం సాధించగా.. రోహిత్ శర్మ 16 మ్యాచుల్లో టీమ్‌ఇండియాను విజేతగా నిలిపాడు. 

దక్షిణాఫ్రికాతో మరో రెండు టీ20లు, అక్టోబర్‌లో ఆసీస్‌ వేదికగా పొట్టి ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో రోహిత్ రికార్డు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ శర్మ టీమ్‌ఇండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. శ్రీలంక, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా (జూన్‌లో), ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మీదనే కాకుండా ఆసియా కప్‌లో పాక్‌, అఫ్గానిస్థాన్‌, హాంకాంగ్‌పై రోహిత్ సారథ్యంలో భారత్‌ విజయాలను నమోదు చేసింది. ద్వైపాకిక్షిక సిరీస్‌ల్లో జట్టు అద్భుతంగా నడిపిస్తున్న రోహిత్ తన తొలి మెగా టోర్నీలో మాత్రం విఫలమయ్యాడు. ఆసియా కప్‌లో సూపర్‌-4 దశకే పరిమితమైన భారత్‌.. ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో వచ్చే టీ20 ప్రపంచకప్‌లో జట్టును విజయపథంలో నడిపించాలని అభిమానులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని