Shami: షమీ సొంత గ్రామంలో మినీ స్టేడియం.. యూపీ ప్రభుత్వం ప్రతిపాదనలు

సంచలన ప్రదర్శనతో ప్రపంచకప్‌లో చెలరేగుతున్న షమీ సొంత గ్రామంలో మినీ స్టేడియం నిర్మించేందుకు యూపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 

Updated : 18 Nov 2023 05:53 IST

యూపీ: ప్రపంచకప్‌(ODI World Cup)లో న్యూజిలాండ్‌(New Zealand)తో జరిగిన సెమీఫైనల్‌(World Cup Semi Final) మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి ప్రపంచాన్ని ఒక్కసారిగా తన గురించి మాట్లాడేలా చేశాడు మహమ్మద్‌ షమీ(Mohammed Shami). ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని షమీ(Shami) సొంత గ్రామంలో మినీ స్టేడియం, ఓపెన్‌ జిమ్‌ నిర్మించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి అమ్రోహ జిల్లా కలెక్టర్‌ రాజేశ్‌ త్యాగి ప్రకటన చేశారు. ‘‘మహమ్మద్‌ షమీ సొంత గ్రామం సాహస్‌పుర్‌ అలీనగర్‌(Sahaspur Alinagar)లో మినీ స్టేడియం, ఓపెన్‌ జిమ్‌ నిర్మించేందుకు నిర్ణయించాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. మినీ స్టేడియం నిర్మించడానికి అనువైన స్థలాన్ని గుర్తించాం’’ అని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో 20 మినిస్టేడియాలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని, వీటిలో అమ్రోహ జిల్లా కూడా ఉందని ఆయన అన్నారు. మినీ స్టేడియం నిర్మించడానికి ఎంపిక చేసిన ప్రాంతాన్ని కలెక్టర్‌ త్యాగి శుక్రవారం పరిశీలించారు. షమీ స్వస్థలంలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాజ్యసభ సభ్యుడు, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ సింగ్‌ ముందుకు వచ్చారు. తన సొంత ఎంపీల్యాడ్‌ నిధులను ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఈ మెగా టోర్నీలో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్న షమీపై అభిమానులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో జట్టులో చోటు లభించకున్నా.. ఆతర్వాత వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టి తానేంటో నిరూపించుకున్నాడు. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌పై 5, ఇంగ్లాండ్‌పై 4, శ్రీలంకపై 5 వికెట్ల ప్రదర్శన చేసిన షమీ.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించాడు. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్‌లోనూ సెమీస్‌ తరహా ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు