WPL 2024: నాట్ సీవర్‌, అమేలియా మెరుపులు.. యూపీ వారియర్స్‌ టార్గెట్ 161

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 రన్స్‌ చేసింది.

Updated : 07 Mar 2024 21:04 IST

దిల్లీ: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా యూపీ వారియర్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 రన్స్‌ చేసింది. నాట్ సీవర్ (45; 31 బంతుల్లో 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ (33; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించింది. చివర్లో అమేలియా కెర్‌ (39; 23 బంతుల్లో 6 ఫోర్లు), సజనా (22*; 14 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. యూపీ బౌలర్లలో చమరి ఆటపట్టు 2, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ముంబయికి వరుస షాక్‌లు తగిలాయి. వారియర్స్‌ స్పిన్నర్‌ చమరి ఆటపట్టు తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (4), యాస్తికా భాటియా (9)ని ఔట్ చేసింది. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబయిని నాట్‌సీవర్‌ ఆదుకుంది. నిలకడగా బౌండరీలు బాది ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో కలిసి మూడో వికెట్‌కు 59 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అర్ధ శతకానికి చేరువైన  నాట్‌సీవర్‌ను రాజేశ్వరి గైక్వాడ్ వెనక్కి పంపింది. నిలకడగా ఆడుతున్న హర్మన్‌ప్రీత్‌ను సైమా ఠాకూర్ క్లీన్‌బౌల్డ్ చేసింది. దీప్తి శర్మ వేసిన తర్వాతి ఓవర్‌లో అమన్‌జ్యోత్‌ కౌర్‌ (7) సైమాకు చిక్కింది. ఆఖరి నాలుగు ఓవర్లలో అమేలియా కెర్‌, సజనా మెరుపులు మెరిపించడంతో ముంబయి పోరాడే స్కోరు సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని