Deepti Sharma: ముక్కోణపు సిరీస్‌ అనుభవాలతో ప్రపంచకప్‌ బరిలోకి దిగుతాం: దీప్తి శర్మ

ముక్కోణపు సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఈ సిరీస్‌లో నేర్చుకున్న అనుభవాలతో ప్రపంచకప్‌లో ముందుకు సాగుతామని అన్నారు.

Published : 04 Feb 2023 00:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముక్కోణపు సిరీస్‌లో నేర్చుకున్న అనుభవాలతో ప్రపంచకప్‌ ఆడతామని భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అన్నారు. భారత్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌ వరకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో గురువారం ఓటమి పాలైంది. ఐదు మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టిన దీప్తి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచింది. 

ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. వేదిక దక్షిణాఫ్రికా కాబట్టి ఆ జట్టుకు సహజంగానే ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. టీ20 ప్రపంచకప్‌కు ముందు నేను చేసిన ప్రాక్టీస్‌ సెషన్లు ఇక్కడ సహాయపడ్డాయి. విభిన్నంగా బంతులను సంధించగలిగా. అయినప్పటికీ వికెట్లు తీయగలిగాను. ఒక జట్టుగా మేం ఒక్కడ ఏం సాధించామో దాన్ని ముందుకు తీసుకెళతాం. ప్రత్యర్థి ఎవరనేది ఆలోచించకూడదు. ఇక్కడ ఎదురైన అనుభవాలతో ప్రపంచకప్‌ ఆడతాం. ఏ జట్టుతో ఆడినా ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తాం. ప్రపంచకప్‌లోనూ ఇలాగే రాణిస్తాం’’ అని దీప్తి పేర్కొంది. మహిళల ప్రపంచ కప్‌ ఫిబ్రవరి 10న ప్రారంభం కానుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌తో ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని