IND vs WI: భారత్‌ పోరాడినా.. విండీస్‌దే విజయం

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ సత్తా చాటింది. సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Published : 02 Aug 2022 05:22 IST

సెయింట్‌ కిట్స్‌: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ సత్తా చాటింది. సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 138 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని విండీస్‌ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా లక్ష్యం మోస్తరే అయినప్పటికీ టీమ్‌ఇండియా ఆఖరి వరకు పోరాడి ఓడింది. ప్రత్యర్థి బ్యాటర్లలో ఓపెనర్‌ బ్రాండన్ కింగ్ (68) అర్ధశతకం సాధించాడు. డెవాన్ థామస్ (31*) కీలక సమయంలో రాణించి ఆకట్టుకున్నాడు. అంతకుముందు కైల్ మేయర్స్ (8), నికోలస్‌ పూరన్‌ (14), హెట్‌మెయర్‌ (6) వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా మారింది.

మెకాయ్‌ మెరుపు బౌలింగ్‌
టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్‌ మెకాయ్‌ చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లు తీసి భారత్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు. మెకాయ్‌కు తోడు మిగతా బౌలర్లు రాణిండంతో భారత్‌ 138 పరుగులకే ఆలౌటైంది.  పాండ్య (31), జడేజా (27), పంత్‌ (24) రాణించారు. మిగతవారు విఫలమవడంతో భారత్‌ మెరుగైన స్కోర్‌ చేయలేకపోయింది. 


టీమ్‌ఇండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి ప్రత్యర్థి జట్టు మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విండీస్‌ విజయానికి ఐదు ఓవర్లలో 38 పరుగులు అవసరం. ఈ క్రమంలో ఓపెనర్‌ బ్రాండన్ కింగ్ (62*) దూకుడుగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేశాడు. అతనితో పాటు డెవాన్ థామస్ (7*) క్రీజ్‌లో ఉన్నాడు. జడేజా వేసిన 12.3 బంతికి హెట్‌మెయర్‌ (6) క్యాచ్‌ ఔటయ్యాడు.



సెయింట్‌ కిట్స్‌: రెండో టీ20లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్‌ చెలరేగుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రాండన్ కింగ్ (47*) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. అతనికి తోడుగా హెట్‌మెయర్‌ (1*) క్రీజ్‌లో నిలబడ్డాడు. అంతకుముందు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య వేసిన 6.1 బంతికి కైల్ మేయర్స్ (8) అశ్విన్‌ చేతికి చిక్కగా, అశ్విన్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (14) సూర్యకుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.


సెయింట్‌ కిట్స్‌: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. రెండో టీ20లో టీమ్‌ఇండియాను బౌలింగ్‌లో బెంబేలెత్తించిన వెస్టిండీస్‌ లక్ష్యఛేదనను ప్రారంభించింది. 139 పరుగుల లక్ష్యఛేదనలో ఆ జట్టు ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టం లేకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (24*), కైల్ మేయర్స్ (7*) దూకుడుగా ఆడుతున్నారు. వికెట్ల కోసం భారత బౌలర్లు శ్రమిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని