Hardik Pandya: ధోనీని ద్వేషించాలంటే.. మహీపై హార్దిక్‌ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఎంఎస్‌ ధోనీ(MS Dhoni)కి తాను పెద్ద అభిమానినని చెప్పాడు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya). నేడు చెన్నైతో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ నేపథ్యంలో జీటీ స్పెషల్‌ వీడియోను పంచుకుంది.

Updated : 23 May 2023 12:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేడు చెన్నై(Chennai Super Kings)తో గుజరాత్‌(Gujarat Titans) తొలి క్వాలిఫయర్‌(Qualifier 1) మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ధోనీ(MS Dhoni)పై గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) ప్రశంసలు కురిపించాడు. తాను ఎప్పుడూ ధోనీ అభిమానినేనని చాటుకున్నాడు. నేటి మ్యాచ్‌ నేపథ్యంలో ధోనీ గురించి పాండ్యా మాట్లాడాడు. 

‘కెప్టెన్‌.. లీడర్‌.. లెజెండ్‌.. ఎంఎస్‌ ధోనీ ఓ ఎమోషన్‌’ అంటూ గుజరాత్‌ టైటాన్స్‌ ట్విటర్‌ ఖాతాలో ఓ స్పెషల్‌ వీడియోను పోస్టు చేసింది. ఇందులో పాండ్యా మాట్లాడుతూ.. ‘చాలా మంది ధోనీ సీరియస్‌గా ఉంటాడని అనుకుంటారు. నేనైతే మహీతో చాలా సరదాగా ఉంటాను. జోక్‌లు వేస్తాను. ధోనీలాగా ఎప్పుడూ అతడిని చూడను’ అని అన్నాడు.

‘‘నిజంగా నేను చాలా విషయాలు ధోనీ నుంచి నేర్చుకున్నాను. అతడితో ఎక్కువగా మాట్లాడకపోయినా.. కేవలం చూస్తూనే చాలా సానుకూల అంశాలు నేర్చుకున్నా. నాకైతే మహీ బెస్ట్‌ ఫ్రెండ్‌, ప్రియమైన సోదరుడు. అతడితో చిలిపి పనులు చేసేవాడిని’’

‘‘ఇక నేనెప్పుడూ ధోనీ అభిమానినే. అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీని ఎవరైనా ద్వేషించాలంటే.. వారు చాలా క్రూరులై ఉండాలి’ అంటూ సరదాగా స్పందించాడు.

ఇక నేటి మ్యాచ్‌(GT vs CSK) విషయానికి వస్తే.. గుజరాత్‌, చెన్నై రెండూ బలమైన జట్లే.  ఐపీఎల్‌లో చెన్నైపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గుజరాత్‌ నెగ్గడం విశేషం. మరోవైపు సొంత మైదానంలో ఆడటం ధోనీ సేనకు ఏ మేరకు కలిసిరానుందో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని