వాట్సాప్‌కు దీటుగా టెలిగ్రాం కొత్త పీచర్స్‌   

ఇతర మెసేజింగ్ యాప్స్‌కి పోటీగా సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది టెలిగ్రాం. అంతేకాకుండా ఇన్‌స్టా మెసేజింగ్‌ యాప్‌లలో లేని కొన్ని ప్రత్యేక ఫీచర్స్‌ టెలిగ్రాం అందిస్తుడటంతో ఈ యాప్‌కు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది....

Published : 15 Nov 2020 03:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇతర మెసేజింగ్ యాప్స్‌కి పోటీగా సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది టెలిగ్రాం. అంతేకాకుండా ఇన్‌స్టా మెసేజింగ్‌ యాప్‌లలో లేని కొన్ని ప్రత్యేక ఫీచర్స్‌ టెలిగ్రాం అందిస్తుడటంతో ఈ యాప్‌కు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా టెలిగ్రాం కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో మల్టిపుల్ పిన్డ్‌ మెసేజెస్‌, లైవ్ లొకేషన్‌ నోటిఫికేషన్‌, మ్యూజిక్‌ ప్లేలిస్ట్ షేరింగ్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.

మల్టిపుల్ పిన్డ్‌ మెసేజెస్‌   

పిన్డ్‌ మెసేజెస్‌ ఫీచర్‌తో గ్రూప్‌లో ఛాట్ చేస్తున్నప్పుడు రకరకాల మెసేజ్‌లను పేర్ల ఆధారంగా పిన్‌ చేసుకోవచ్చు. ఒక వేళ ఛాటింగ్ మధ్యలో వాటిని చూడాలనుకుంటే  గ్రూపు పై భాగంలో కుడి వైపున పిన్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ప్రత్యేక పేజ్‌లో పిన్ చేసిన మెసేజ్‌లు కనిపిస్తాయి.  

లైవ్ లొకేషన్‌

గతంలో ఉన్న లైవ్ లొకేషన్ ఫీచర్‌ను మరింత మెరుగ్గా పనిచేసేలా మార్పులు చేశారు. ఇందులో మన స్నేహితులు లేదా కుటుంబసభ్యులు ఎవరైనా తమ లొకేషన్‌ను షేర్ చేస్తే మనకు వెంటనే అలర్ట్‌ నోటిఫికేషన్ వస్తుంది. అలానే వాళ్లు మన లొకేషన్‌కు దగ్గరగా వచ్చినప్పుడు నోటిఫికేషన్‌తో మనల్ని అలర్ట్ చేస్తుంది. దానితో పాటు లైవ్‌ లొకేషన్‌ ఫీచర్‌లో ఉన్న ఐకాన్స్‌తో వాళ్లు ఏ దిశగా వస్తున్నారనేది కూడా తెలుసుకోవచ్చు.

మ్యూజిక్‌ షేరింగ్

మీ స్నేహితులు ఒకేసారి ఎక్కువ పాటలను టెలిగ్రాంలో ఫార్వర్డ్ చేశారు. ఇందులోని బిల్ట్‌-ఇన్‌ మీడియా ప్లేయర్‌ ఫీచర్ వాటిని వరుస క్రమంలో ఉంచి ఒక దాని తర్వాత ఒకటి వినేలా ప్లేలిస్ట్‌ను చూపిస్తుంది. దాని వల్ల మీరు పాటలను సులభంగా వినొచ్చు. అలానే వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయడంతో పాటు కామెంట్ చెయ్యొచ్చు.

ఇవే కాకుండా టెలిగ్రాంలో ఉండే ఛానల్స్‌ అడ్మిన్స్‌ సబ్‌స్క్రైబర్స్‌ యాక్టివిటినీ ట్రాక్‌ చేయడంతో పాటు పాటు ఛానల్‌ స్టాటిస్టిక్స్‌ తెలుకునేలా కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. అలానే ఆండ్రాయిడ్ యూజర్స్‌ మెసేజ్‌లు పంపేప్పుడు యానిమేషన్స్‌తో పాటు, మ్యూజిక్‌ ప్లేయర్‌ నుంచి పాటలను పంపొచ్చు. వాటితో పాటు ఛాట్‌లో మీకు వచ్చిన ఫొటోను ఇన్‌స్టాంట్‌గా ఎడిట్ చేసి రీసెండ్ చేసే ఫీచర్‌ ఇస్తున్నారు. దీని వల్ల ఫొటోను డౌన్‌లోడ్ చేసి ఎడిట్ చేసి తిరిగి పోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. హాలోవీన్‌ యానిమేటెడ్ ఎమోజీలతో పాటు జాక్‌పాట్ స్లాట్ మెషీన్‌ ఎమోజీని కూడా కొత్త అప్‌డేట్‌లో తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని