ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తితిదే జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శనివారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2 నెలలకు కలిపి దాదాపు 13,35,000 టికెట్లు విడుదల చేయగా..

Updated : 22 May 2022 05:03 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తితిదే జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శనివారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2 నెలలకు కలిపి దాదాపు 13,35,000 టికెట్లు విడుదల చేయగా.. భక్తులు 2.78 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. రెండు నెలల్లో 7 రోజులు మినహా మిగిలిన రోజులకు టికెట్లను అందుబాటులో ఉంచింది. జులైలో 3 రోజుల టికెట్లు పూర్తిగా బుక్‌ కాగా.. మిగిలిన రోజులకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని