7 నుంచి కాకతీయ సప్తాహం

తెలంగాణకు మహత్తర సేవలందించిన కాకతీయుల వైభవాన్ని భావితరాలకు తెలియజేసేలా వచ్చే నెల ఏడో తేదీ నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కాకతీయ సప్తాహాన్ని నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి

Published : 29 Jun 2022 05:20 IST

 రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహణ

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు మహత్తర సేవలందించిన కాకతీయుల వైభవాన్ని భావితరాలకు తెలియజేసేలా వచ్చే నెల ఏడో తేదీ నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కాకతీయ సప్తాహాన్ని నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కాకతీయుల వైభవాన్ని చాటేలా సాంస్కృతిక, సాహిత్య, కళా కార్యక్రమాలను ఘనంగా జరుపుతామని తెలిపారు. మంగళవారం ఆయన తమ కార్యాలయంలో కాకతీయ ఉత్సవాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాకతీయులు తెలంగాణ ప్రాంతానికి అమూల్య సేవలు, మహత్తర పాలన అందించారు. వారి స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ ‘మిషన్‌ కాకతీయ’ పేరుతో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. కాకతీయుల సేవానిరతి, తెలంగాణ అనుబంధాన్ని వివరించేందుకు ప్రత్యేక ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర బాంజ్‌దేవ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించాం. ఎన్నో ఏళ్ల తర్వాత  పురిటిగడ్డకు వస్తున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించుకుంటాం’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యటకాభివృద్ది సంస్థ ఎండీ మనోహర్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని