శ్రీవారి ప్రసాదానికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు

తిరుమల శ్రీవారి నైవేద్యం, ఇతర ప్రసాదాల తయారీ కోసం 12 రకాల గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సేకరించాలని తితిదే నిర్ణయించింది.

Published : 03 Jul 2022 06:19 IST

తిరుపతి, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి నైవేద్యం, ఇతర ప్రసాదాల తయారీ కోసం 12 రకాల గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సేకరించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలో శనివారం ఆ సంస్థ, మార్క్‌ఫెడ్‌ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

బయోడీగ్రేడబుల్‌ ప్లేట్ల తయారీపై పరిశోధనలు: సతీష్‌రెడ్డి

తిరుమలలో బయోడీగ్రేడబుల్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ శాస్త్రవేత్తలు బయోడీగ్రేడబుల్‌ కవర్లు తయారుచేశారని, వాటిని తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రం వద్ద అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. త్వరలోనే బయోడీగ్రేడబుల్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని