హెచ్‌టీ కనెక్షన్లకు ప్రత్యేక ఫీడర్‌

రాష్ట్రంలో హైటెన్షన్‌ (హెచ్‌టీ) కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు పలు సదుపాయాలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ

Published : 18 Aug 2022 05:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో హైటెన్షన్‌ (హెచ్‌టీ) కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు పలు సదుపాయాలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) సూచించింది. దీనికి సంబంధించి డిస్కంలు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ‘సాధారణ నిబంధనల ముసాయిదా’ను బుధవారం విడుదల చేసింది. వీటిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను వచ్చే నెల 8లోగా పంపాలని కోరింది. ఎవరైనా 132 కేవీ సామర్థ్యంతో హెచ్‌టీ కనెక్షన్‌ తీసుకుంటే వారికి నిరంతర కరెంటు సరఫరాకు ప్రత్యేక ఫీడర్‌ (లోడు ఆధారంగా) ఏర్పాటుచేయాలని డిస్కంలకు ప్రధానంగా సూచించింది. సంబంధిత వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని