మాజీ ఎమ్మెల్యే భూపతిరావు కన్నుమూత

ఖమ్మం జిల్లా పాలేరు మాజీ శాసనసభ్యుడు భీమపాక భూపతిరావు(86) సోమవారం భద్రాచలంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈయన కొద్ది రోజులుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భూపతిరావు

Published : 06 Sep 2022 03:55 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా పాలేరు మాజీ శాసనసభ్యుడు భీమపాక భూపతిరావు(86) సోమవారం భద్రాచలంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈయన కొద్ది రోజులుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భూపతిరావు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1983లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పాలేరు శాసనసభ్యుడిగా గెలుపొందారు. భద్రాచలంలో ఈయన కృషి ఫలితంగా ఏర్పడిన కాలనీకి భూపతిరావుకాలనీ అని పేరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా బస్సుల్లోనే ప్రయాణం చేసేవారు. భూపతిరావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ భీమపాక నగేశ్‌ ఈయన మూడో కుమారుడు. మంగళవారం భద్రాచలంలో భూపతిరావు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని