టీసీఎస్‌ అయాన్‌ ఇంటెలి‘జెమ్‌’.. సంస్కృతి

తెలంగాణ మహిళా భద్రత విభాగం డీఐజీ కొండూరు సుమతి కుమార్తె సంస్కృతి.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది.

Published : 29 Jan 2023 03:28 IST

జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన చిన్నారి
తల్లికి తగ్గ తనయగా నిలిచిన డీఐజీ సుమతి కుమార్తె

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మహిళా భద్రత విభాగం డీఐజీ కొండూరు సుమతి కుమార్తె సంస్కృతి.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ అధీనంలోని ‘టీసీఎస్‌ అయాన్‌ ఇంటెలిజెమ్‌’ నిర్వహించిన అయిదో ఎడిషన్‌ జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా నిలిచి సత్తా చాటింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న సంస్కృతి ‘యూనివర్సల్‌ వాల్యూస్‌’ అంశంపై జూనియర్స్‌ విభాగంలో రాష్ట్రం నుంచి విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలల నుంచి వేలమంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారు. గ్రాండ్‌ఫినాలేకు అర్హత సాధించిన 50 మంది నుంచి 11 మందిని తుది విజేతలుగా ప్రకటించారు. సీనియర్లు, జూనియర్లకు ఒకే తరహాలో యూనివర్సల్‌ వాల్యూస్‌, సమాచార నైపుణ్యాలు, ప్రపంచ పౌరసత్వం, సృజన, పరిశోధన, ఆర్థిక అక్షరాస్యత విభాగాల్లో నిర్వహించిన ప్రిఫైనల్‌ పోటీల్లో సంస్కృతి మూడింటిలో గ్రాండ్‌ ఫినాలేకు అర్హత సాధించింది. టీసీఎస్‌ పోటీల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ తరఫున తొలివిజేతగా సంస్కృతి గుర్తింపు తెచ్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని