తెలంగాణలో కొద్దిరోజులు వేడి నుంచి ఉపశమనం.. 16 తర్వాత వర్షాలు

రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది.

Published : 12 Mar 2023 07:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచిస్తున్నారు. మరోవైపు శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని