పత్తి రైతుపై కత్తి దూసిన వర్షం

అకాల వర్షం పత్తి రైతులను దెబ్బతీసింది. ధర పెరుగుతుందనే ఆశతో పొలాల్లో నిల్వ ఉంచిన పంట తడిసిపోవడంతో ఒక్కొక్కరు 4 నుంచి 6 క్వింటాళ్ల మేర నష్టపోయారు.

Published : 27 Mar 2023 04:56 IST

తడిసి మొలకెత్తిన దూది.. ఆపై పడిపోయిన ధర

ఈనాడు, సంగారెడ్డి: అకాల వర్షం పత్తి రైతులను దెబ్బతీసింది. ధర పెరుగుతుందనే ఆశతో పొలాల్లో నిల్వ ఉంచిన పంట తడిసిపోవడంతో ఒక్కొక్కరు 4 నుంచి 6 క్వింటాళ్ల మేర నష్టపోయారు. సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాది డిసెంబరు నెలాఖరులో వ్యాపారులు క్వింటాకు రూ.9,200 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు పత్తి ధర రూ.7,200కు పడిపోయింది. అటు ధర పతనం, ఇటు అకాల వర్షాలతో తాము నష్టపోయామని సదాశివపేట మండలం బొబ్బిలిగామ రైతులు వాపోయారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని, పత్తిని ఇంటి ముందు నిల్వచేస్తే వర్షానికి నానిపోయిందని గ్రామానికి చెందిన కౌలు రైతు ప్రవీణ్‌ ఆవేదన చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని