బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయండి

కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

Published : 01 Apr 2023 04:49 IST

కేంద్ర మంత్రి అమిత్‌షాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వినతి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, పంచాయతీరాజ్‌ సంస్థలో బీసీలకు రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అమిత్‌షాను ఆర్‌.కృష్ణయ్య, నాయకులు శుక్రవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా జనగణన బీసీ కులాల గణన చేపట్టాలని కోరారు. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, ఇతర డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కృష్ణయ్య తెలిపారు.

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని డిమాండ్‌ చేస్తూ కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్‌ మాట్లాడుతూ దీనిపై ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. మహాధర్నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘాధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో శుక్రవారం ధర్నా చేపట్టారు. టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాస్‌ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నందున వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదించాలని కోరారు. వర్గీకరణ అమలైతేనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని