‘గురుకుల’ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,120 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) షెడ్యూలులో గురుకుల నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసింది.

Published : 20 Jul 2023 05:43 IST

ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షల నిర్వహణ
24 నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,120 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) షెడ్యూలులో గురుకుల నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసింది. తొలుత ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపిన బోర్డు... తాజాగా ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ‘‘పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయి. వాటిని ఒకేసారి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పరీక్షల సవరణ షెడ్యూలును వెబ్‌సైట్లో పొందుపరిచాం. అభ్యర్థులు పరీక్ష తేదీలను మరోసారి చూసుకోవాలి. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుంది’’ అని గురుకుల నియామక బోర్డు వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని