నల్గొండ, ఖమ్మం గరంగరం

ఖమ్మం నగరం నిప్పుల కుంపటిలా మారింది. ఇక్కడ మంగళ, బుధవారాల్లో వడగాలులు వీచాయి. బుధవారం సాధారణం కన్నా ఏకంగా 6 డిగ్రీలు పెరిగి 43.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

Published : 18 Apr 2024 02:54 IST

 8 జిల్లాల్లో 44.3 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత
పిడుగుపాటుతో ఒకరు, వడదెబ్బకు మరొకరు మృతి

ఈనాడు, హైదరాబాద్‌, ఖానాపూర్‌ గ్రామీణం, మార్కండేయకాలనీ(గోదావరిఖని), న్యూస్‌టుడే: ఖమ్మం నగరం నిప్పుల కుంపటిలా మారింది. ఇక్కడ మంగళ, బుధవారాల్లో వడగాలులు వీచాయి. బుధవారం సాధారణం కన్నా ఏకంగా 6 డిగ్రీలు పెరిగి 43.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. నల్గొండ జిల్లా నిడమనూరు రాష్ట్రంలోనే అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతతో అల్లాడింది. 8 జిల్లాల్లో 44.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సింగాపూర్‌ తండాలో బుధవారం సాయంత్రం రామెల లక్ష్మి(51) పొలంలో చెట్టు కింద కూర్చొని ఉండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ జంగాలపల్లికి చెందిన మేకల రవికుమార్‌(32) మంగళవారం గేదెలు మేపేందుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని