టెట్‌ వాయిదా అంశాన్ని పరిశీలించండి

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి సూచించారు.

Published : 03 May 2024 04:59 IST

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సూచన

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి సూచించారు. టెట్‌ను మే 20 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు జరపాలని విద్యాశాఖ గత నెలలో నిర్ణయించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పరీక్షల నేపథ్యంలో ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఒక ఉపాధ్యాయుడు ఈసీకి ఫిర్యాదు చేయడంతో వికాస్‌రాజ్‌ దీనిపై స్పందించారు. వెంటనే చర్య తీసుకొని.. ఆ సమాచారాన్ని తనకు, అర్జీదారుకు పంపించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. కాగా వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంకటేశం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని