తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!

వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు.

Published : 03 May 2024 07:59 IST

ట్రాక్టర్‌ ప్రమాదంలో డ్రైవర్‌ విలవిల

వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. ఈ ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మద్దూరుకు చెందిన మాలిక్‌ ఇసుక లోడుతో ట్రాక్టర్‌ నడుపుతూ కలుకుంట్ల గ్రామం మీదుగా అమరవాయి వైపు వెళ్తున్నాడు. వేగంగా నడపడంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి రహదారి పక్కన బోల్తా పడింది. దీంతో దారి పక్కనున్న చెట్టుకొమ్మ మాలిక్‌ తొడలోకి బలంగా దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే అతన్ని ఆటోలో మానవపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యసిబ్బంది సూచన మేరకు అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు తొడలోకి చొచ్చుకుపోయిన చెట్టుకొమ్మను తొలగించి చికిత్స అందించారు.

న్యూస్‌టుడే, మానవపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు