యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

Published : 06 May 2024 03:12 IST

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. దర్శనానికి బారులు తీరిన భక్తులతో క్యూ కాంప్లెక్స్‌ కిక్కిరిసిపోగా.. ప్రసాదాల కౌంటర్‌ వద్ద కూడా భక్తులు భారీగా బారులు తీరారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో పలు జంటలు పాల్గొనగా.. నిత్యారాధనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.53,32,909 ఆదాయం చేకూరిందని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని