సమానంగానే చూస్తున్నారా?

ఇంట్లో ఒకరికి మించి పిల్లలు ఉంటే చాలు... తరచూ తగాదాలే. ‘అన్ననే నువ్వు బాగా చూస్తావ్‌’. ‘చెల్లికే నువ్వు అన్నీ కొనిస్తావ్‌’ అంటూ అలకబూనుతుంటారు. ఇది కొంతవరకూ  పరవాలేదు కానీ తోబుట్టువులపై ద్వేషం పెంచుకునే వరకూ వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

Published : 25 May 2024 03:57 IST

ఇంట్లో ఒకరికి మించి పిల్లలు ఉంటే చాలు... తరచూ తగాదాలే. ‘అన్ననే నువ్వు బాగా చూస్తావ్‌’. ‘చెల్లికే నువ్వు అన్నీ కొనిస్తావ్‌’ అంటూ అలకబూనుతుంటారు. ఇది కొంతవరకూ  పరవాలేదు కానీ తోబుట్టువులపై ద్వేషం పెంచుకునే వరకూ వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇందుకోసం నిపుణులు ఏం సలహా ఇస్తున్నారంటే...

తల్లిదండ్రులుగా ఇద్దరు పిల్లల్నీ వేర్వేరుగా చూడాలన్న పక్షపాతం మీకు లేకపోయి ఉండొచ్చు. కానీ తరచూ ఒకరితో ఒకరు గొడవ పడటం, చిన్నబుచ్చుకోవడం చేస్తుంటే... వారికి కాస్త మీ ప్రేమ అవసరం అని తెలుసుకోండి. ఇద్దరూ సమానమే అని చెప్పే ప్రయత్నం చేయండి. తనతో మీరు చిన్నప్పుడు ఎంత చనువుగా ఉండేవారో చెబుతూ ఉండండి. ఇది తనలోని అభద్రతా భావాన్ని దూరం చేస్తుంది. ఆ జ్ఞాపకాలన్నీ క్రమంగా తన అపోహల్ని దూరం చేయొచ్చు.

  • అమ్మానాన్నలు.. వయసులో చిన్నది కదా అని ఆఖరిదానికి అడిగినవన్నీ తెచ్చివ్వడంలో తప్పులేదు. కానీ, అదే సమయంలో పెద్దవాడి ఇష్టాలకూ ప్రాధాన్యం ఇవ్వండి. లేదంటే, మీకూ, తనకీ మధ్య చెల్లి వచ్చిందనే అభద్రత, బాధ తోబుట్టువుతో గొడవలకు దారితీస్తాయి.
  • పిల్లల్లో అల్లరి, గిల్లికజ్జాలు మామూలే. తప్పొప్పులు ఇద్దరివైపూ ఉంటాయి. అలా కాకుండా పెద్దాడే చేసుంటాడు. లేదా చిన్నదే చేస్తుందిలా అనే నిర్ధరణకు వచ్చేయకండి. సమస్య ఏంటో తెలుసుకుని సరిదిద్దినప్పుడు గొడవలు రావు. ఇంకోసారి ఒకరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితి ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్