Published : 14/10/2022 18:55 IST

NRI: డెన్మార్క్‌లో ‘బతుకమ్మ’ సందడి!

విదేశాల్లో స్థిరపడ్డా తమ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని పాటించడంలో ముందుంటారు భారతీయులు. పండగైనా, ప్రత్యేక సందర్భమైనా ఒక్కచోట చేరి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటారు. ఇటీవలే డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన బతుకమ్మ, దసరా వేడుకలూ ఇందుకు మినహాయింపు కాదు.

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌ (టీఏడీ) ఆధ్వర్యంలో ఓ స్థానిక పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో అక్కడ స్థిరపడిన తెలంగాణ ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, సంప్రదాయ కట్టూ-బొట్టుతో ముస్తాబై తరలివచ్చారు. చిన్నారులూ పట్టుపరికిణీల్లో మెరిసిపోయారు. బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఆపై బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బతుకమ్మలు బాగా పేర్చిన వారికి బహుమతులు కూడా అందించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని