కొత్త సంవత్సరం.. కొత్త సంకల్పం..

మరొక్క రోజులో కొత్త ఏడాదిలో అడుగుపెడతాం. మరి సంకల్పం (న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌) గురించి ఏం ఆలోచించారు? ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. మీరు కూడా ఏదైనా లోపాన్ని సవరించుకోవాలనో, ఏ అంశంలోనైనా మారాలనో అనుకుంటే వాటిని ఈరోజు నుంచే ఆచరణలో పెట్టండి.

Published : 31 Dec 2022 01:14 IST

మరొక్క రోజులో కొత్త ఏడాదిలో అడుగుపెడతాం. మరి సంకల్పం (న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌) గురించి ఏం ఆలోచించారు? ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. మీరు కూడా ఏదైనా లోపాన్ని సవరించుకోవాలనో, ఏ అంశంలోనైనా మారాలనో అనుకుంటే వాటిని ఈరోజు నుంచే ఆచరణలో పెట్టండి.. అవి మీ ఆనందాలను రెట్టింపు చేయకపోతే చూడండి..

గుసగుసలు... మనకి ఇంటా బయటా ఎన్ని పనులున్నా మధ్యమధ్య ఉబుసుపోని కబుర్లు తప్పకుండా ఉంటాయి. అవి సినిమాలూ షికార్ల లాంటి సరదా విషయాలైతే బాగానే ఉంటుంది. అందులో వంక పెట్టాల్సిందేమీ లేదు. కానీ ఎవరో ఒకరి గురించి ఆరోపణలూ అవమానించే అంశాలైతే మట్టుకు ఆపేయడమే మేలు. ఇలాంటివి ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లకి చేరతాయి, బాధ పడతారు. నిజానికి ఈ ఆక్షేపణలతో మనకూ శాంతి ఉండదు. అవతలి వ్యక్తిలో ఉన్న లోపాల గురించేగా మాట్లాడుతున్నాం, తప్పేం ఉంది అనుకోవద్దు. ఒకవేళ అవి నచ్చలేదంటే ఆ వ్యక్తితోనే ప్రస్తావించడం మేలు. వీలైతే తమని తాము మార్చుకుంటారు. లేదంటే తమ ఇబ్బంది ఏమిటో చెబుతారు. అప్పుడిక మీకూ వారి పట్ల సానుభూతి కలుగుతుంది. చాటున అనడం వల్ల లాభం లేకపోగా శత్రుత్వం ఏర్పడుతుంది. అలాంటి బలహీనత ఉంటే వెంటనే మానేయండి. తోటివాళ్లు చెప్పబోయినా అక్కణ్ణించి వెళ్లిపోండి.

మొక్కలు నాటండి... ‘పర్యావరణ కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ నిషేధాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇదెంత భయానకమో ఎవరికీ పట్టడం లేదు’ అంటూ మనం రోజూ తిట్టుకుంటూనే ఉంటాం. ఇతరుల సంగతలా ఉంచి మనమేం చేయగలమో ఆలోచించండి. ఇకపై ప్లాస్టిక్‌ను దూరం పెడతానని గట్టిగా నిర్ణయించుకోండి. కూరగాయలూ అత్యవసర సరుకుల కోసం మీ హ్యాండ్‌బ్యాగ్‌లో ఓ వస్త్రసంచి ఉంచుకున్నారంటే పాలిథిన్‌ కవర్లను నిరోధించినట్లే. మినరల్‌ వాటర్‌ బాటిళ్లు కొనకపోవడం లాంటి చర్యలతో మీ వంతు కాలుష్యం తగ్గించండి. మిమ్మల్ని చూసి ఇంకెందరో మారతారు. పనిలో పనిగా ఇంట్లోనో, రోడ్డు పక్కనో, ఏ ఖాళీ స్థలంలోనో నెలకి ఒక మొక్క నాటతానని ఒట్టు (ఓత్‌) పెట్టుకోండి. దీనివల్ల సామాజిక ప్రయోజనంతోబాటు గొప్ప సంతృప్తి మీ సొంతమౌతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్