Career Advice: పదోన్నతి దూరమవుతోందా..

శ్రీలేఖకు పదేళ్ల అనుభవం ఉంది. అయినా తన తర్వాత వచ్చినవారందరికీ పదోన్నతి దొరుకుతున్నా..ఆమెకు మాత్రం దూరమవుతూనే ఉంది.

Published : 24 Feb 2023 00:20 IST

శ్రీలేఖకు పదేళ్ల అనుభవం ఉంది. అయినా తన తర్వాత వచ్చినవారందరికీ పదోన్నతి దొరుకుతున్నా..ఆమెకు మాత్రం దూరమవుతూనే ఉంది. విధుల్లో చేసే పొరపాట్లు దీనికి కారణమవు తాయంటున్నారు కెరియర్‌ నిపుణులు.

కొందరు ఉద్యోగినులు తమ పని పూర్తిచేయడంపై మాత్రమే ఏకాగ్రత ఉంచుతారు. బృంద సభ్యురాలిగా ఎంత కృషి చేసినా, అవసరమైనప్పుడు చొరవ తీసుకొని మిగతావారి పనుల్లో చేయూతనందించడానికి ఆసక్తి చూపించరు. కొన్ని అత్యవసర సందర్భాల్లో ముఖ్యమైనదేదైనా పని పూర్తకాకపోవచ్చు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఏదైనా పూర్తిచేయాల్సిన పని ఉందేమో అని దృష్టి పెట్టాలి. వాటిలో సహకారం అందించడానికి ప్రయత్నించాలి. ఇది బృందంతో కలిసి పనిచేసిన అనుభవంతోపాటు పై అధికారులకు మీ నైపుణ్యాలపై అవగాహన వచ్చేలా చేస్తుంది. ఎటువంటి బాధ్యతనప్పగించినా పూర్తిచేయగల సమర్థత మీలో ఉందని, అవసరమైనప్పుడు చొరవ తీసుకుంటుందని తెలుసుకుంటారు. దాంతో పదోన్నతికి మీపేరు జాబితాలో చేరుతుంది.

ధైర్యంగా.. కెరియర్‌లో అవకాశం అదే వస్తుందని ఎదురు చూడకుండా ధైర్యంగా ముందడుగు వేయగలగాలి. అవకాశమిస్తే ఏ పనైనా విజయవంతంగా చేసి చూపిస్తా అని ౖకూర్చోవద్దు. ఎవరో వచ్చి అడుగుతారనీ ఎదురుచూడొద్దు. ఫలానా పని నేను చేయగలనని చెప్పి మరీ ముందుకెళ్లాలి. కేటాయించిన సమయంలోపే.. పూర్తిచేసి అందించాలి. అప్పుడే మీ నైపుణ్యాలు పై అధికారులకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఎవరూ ముందుకెళ్లడం లేదని, నలుగురితోపాటు మీరూ మౌనంగా ఉండిపోతే అందరిలో మీరూ ఒకరిగా మిగిలిపోతారు. మీకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోలేరు. ధైర్యంతో ముందడుగు వేస్తే విజయంతోపాటు పదోన్నతికీ మీపేరు నమోదవుతుంది. 

నైపుణ్యాలు.. ఉద్యోగ బాధ్యతల్లో సమయపాలన అత్యంత ముఖ్యం. సమయంలోపు పూర్తిచేయాల్సిన పనుల ప్రాముఖ్యతపై అవగాహన లేకపోతే కెరియర్‌లో నష్టపోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. బృందంతో కలిసి పనిచేయడం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవడం వంటివన్నీ కెరియర్‌లో విజయాలను అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్