నా ఫ్రెండ్ భర్త.. అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు!
డిగ్రీ చదివే రోజుల్లో నాకు ఒక అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుంచి మేము మంచి స్నేహితులుగా ఉంటున్నాం. మాకు పెళ్లిళ్లు అయినా కూడా ఒకరి ఇంటికి మరొకరం వెళుతుంటాం. అలా నా స్నేహితురాలి భర్తతో కూడా పరిచయం ఏర్పడింది. ఒకరోజు అతను వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు.
డిగ్రీ చదివే రోజుల్లో నాకు ఒక అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుంచి మేము మంచి స్నేహితులుగా ఉంటున్నాం. మాకు పెళ్లిళ్లు అయినా కూడా ఒకరి ఇంటికి మరొకరం వెళుతుంటాం. అలా నా స్నేహితురాలి భర్తతో కూడా పరిచయం ఏర్పడింది. ఒకరోజు అతను వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు. నేను కూడా నార్మల్‌గా చాట్ చేశా. అయితే ఇప్పుడు అతడు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పెడుతున్నాడు. మొదట్లోనే అతడిని బ్లాక్ చేసుంటే బాగుండేదనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం నా స్నేహితురాలికి కానీ, నా భర్తకు కానీ చెబితే నన్నే అపార్థం చేసుకుంటారేమోనని భయంగా ఉంది. దయచేసి ఈ విషయంలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీరు ఎలాంటి దురుద్దేశం లేకుండానే అతడితో మాట్లాడారు. అయితే ఎప్పుడైతే అతడు అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపిస్తున్నాడో అప్పట్నుంచి పరిస్థితి మీకు ఇబ్బందికరంగా మారింది. ఇది కొన్ని రోజలుగా జరుగుతోంది కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పినా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు. మొదట్లోనే అతడిని బ్లాక్ చేయనందుకు చింతిస్తున్నానంటున్నారు. నిజానికి ఇందులో మీ తప్పు లేదని మీరు భావించినప్పుడు.. మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.
ఈ విషయం మీ ఫ్రెండ్‌కి లేదా మీ భర్తకు తెలిస్తే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని అనుకుంటున్నారు. కాబట్టి, ముందుగా ఈ విషయాన్ని మీ స్నేహితురాలి భర్తతోనే చర్చించే ప్రయత్నం చేయండి. ‘ఇలాంటి సంభాషణలు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇక్కడితో వాటికి స్వస్తి చెప్పండి’ అని అతనితో స్పష్టంగా, సున్నితంగా తెలియజేయండి. ఒకవేళ మీరిద్దరూ సమస్యను పరిష్కరించుకుంటే మూడో వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉండదు. మీ ఆందోళన కూడా తగ్గుతుంది. అతని నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం ఈ విషయాన్ని మీ భర్తకు లేదా స్నేహితురాలికి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు ఎలాంటి తప్పు చేయలేదన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరించడం ముఖ్యం. తద్వారా వారు కచ్చితంగా మిమ్మల్ని, మీరు పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకుంటారు. ఫలితంగా మీ సమస్యకు పరిష్కరం లభించడమే కాకుండా మీలో ఉన్న అపరాధ భావన కూడా తొలగిపోతుంది. కాబట్టి సానుకూల దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
ఆరోగ్యమస్తు
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!