పాపకు నత్తి, మాటల్లో తడబాటు.. పరిష్కారమేమిటి?
మా అమ్మాయి వయసు ఆరేళ్లు. సరిగా మాట్లాడలేకపోతోంది. నత్తి, తడబాటు కనిపిస్తున్నాయి. తను మాట్లాడే మాటలు కూడా సరిగా అర్థం కావడం లేదు. ఈ సమస్య వల్ల పాపని నలుగురిలోకి తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇది ఆరోగ్య సమస్యా? ఏ డాక్టర్‌కి చూపిస్తే ఫలితం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మా అమ్మాయి వయసు ఆరేళ్లు. సరిగా మాట్లాడలేకపోతోంది. నత్తి, తడబాటు కనిపిస్తున్నాయి. తను మాట్లాడే మాటలు కూడా సరిగా అర్థం కావడం లేదు. ఈ సమస్య వల్ల పాపని నలుగురిలోకి తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇది ఆరోగ్య సమస్యా? ఏ డాక్టర్‌కి చూపిస్తే ఫలితం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. పిల్లలు ఎదిగే క్రమంలో పలు మైలురాళ్లను దాటుతుంటారు. ఇందులో మాటలు నేర్చుకోవడం, మాట్లాడడం కూడా ప్రధానమైనది. అయితే కొంతమంది పిల్లలు ఈ మైలురాయిని సరిగా దాటలేకపోతున్నారు. ఈ క్రమంలో మాట్లాడేటప్పుడు నత్తి, తడబాటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని ‘లాంగ్వేజ్ డిజార్డర్’ అంటుంటాం. ఇందులో భాగంగా నత్తి, తడబాటు.. వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
నత్తి అనేది పిల్లల్లో పలు కారణాల వల్ల వస్తుంటుంది. కొంతమందిలో జన్యుపరంగా ఈ సమస్య వస్తుంటుంది. అంటే.. వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నత్తి ఉంటే పిల్లలకు కూడా వస్తుంటుంది. మరికొంతమందిలో గందరగోళం వల్ల కూడా నత్తి వస్తుంటుంది. అంటే ఇంట్లో మాతృభాష మాట్లాడడం, బయట మరో భాష మాట్లాడడం వల్ల పిల్లలు గందరగోళానికి గురవుతుంటారు. దానివల్ల కూడా నత్తి వస్తుంటుంది. ఈ సమస్య ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే చాలామందిలో మాత్రం నలుగురిలోకి వెళ్లకపోవడం (సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం) వల్ల నత్తి వస్తుంటుంది. ఇంట్లో తోబుట్టువులు లేకపోవడం, గ్రాండ్ పేరెంట్స్‌కి దూరంగా ఉండడం, ఇతరులతో ఎక్కువగా కలవకపోవడం.. వంటివి ఇందుకు కారణాలు. ఇలా మీ అమ్మాయి నత్తికి గల కారణాన్ని అన్వేషించండి. దానికి తగిన పరిష్కారాన్ని వెతకడంతో పాటు స్పీచ్ థెరపీ వంటివి ఇప్పిస్తే చాలావరకు నత్తి సమస్యను తగ్గించుకోవచ్చు. చాలా కొద్దిమందిలో నాలుక మందంగా ఉండడం వల్ల నత్తి వస్తుంటుంది. ఇలాంటివారికి తగిన చికిత్స అందించడం వల్ల సమస్యను దూరం చేయచ్చు.
ఇక రెండో సమస్య తడబాటు.. మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోవడం, వేగంగా మాట్లాడడం, ఏదో ఒకటి త్వరగా మాట్లాడాలి అనుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. దీనిని ప్రాక్టీస్ ద్వారానే నయం చేసుకోవచ్చు. మీ అమ్మాయి వయసు ఆరేళ్లని చెబుతున్నారు. కాబట్టి తను మాట్లాడుతున్నప్పుడు తప్పులను ఎత్తి చూపకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ తప్పులను ఎత్తి చూపిస్తే.. మాట్లాడితే ఎక్కడ తప్పులు వస్తాయేమోనని క్రమంగా మాట్లాడడం మానేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా తప్పులను ఎత్తి చూపకుండా ఎక్కువసేపు మాట్లాడించడానికి ప్రయత్నించండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా రోజుకు 10 పదాలను లక్ష్యంగా పెట్టుకుని ప్రాక్టీస్ చేయించండి. దీనివల్ల క్రమంగా మీ పాప ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
ఆరోగ్యమస్తు
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
- చాందీపుర వైరస్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
- మలార్ వాట్సాప్... టీచర్!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!
- ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుందిలా..