ఆలస్యమైతే.. జాగ్రత్త!

ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఆలస్యమవటమో, బస్సులు లేకపోవటం వల్లనో కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవటం సహజమే. ప్రభుత్వం ఎన్ని చట్టాలు ప్రవేశ పెట్టినా ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు.

Published : 30 Mar 2023 00:26 IST

ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఆలస్యమవటమో, బస్సులు లేకపోవటం వల్లనో కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవటం సహజమే. ప్రభుత్వం ఎన్ని చట్టాలు ప్రవేశ పెట్టినా ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. కానీ ఆ పరిస్థితిలో భయపడటం కంటే దాన్ని ధైర్యంగా ఎలా దాటాలో ఆలోచించమంటున్నారు నిపుణులు..

* మహిళల భద్రత గురించి నూతన సాంకేతికతతో యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. రాత్రివేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే వాటిని ఆన్‌లో ఉంచుకోవాలి.

* చీకట్లో నడుస్తున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడకండి. ఎందుకంటే దృష్టి మొత్తం ఫోన్‌ మీదే ఉంటుంది. దీంతో చుట్టూ ఏం జరుగుతుందో గమనించలేం. కాబట్ట్టి అప్రమత్తంగా ఉండాలి.అప్పుడే ఆపద ఎటునుంచి వస్తుందో కనిపెట్టగలం.

* ఒంటరిగా ఉన్నాం అని ఏ చిన్న అలికిడి అయినా భయపడిపోకూడదు. ధైర్యంగా ఉండాలి. బ్యాగులో ఎప్పుడూ చిన్న పెప్పర్‌ స్ప్రే బాటిల్‌ను ఉంచుకోవాలి. ఆపద వేళ ఉపయోగపడుతుంది. తేరుకొని ‘100’కి కాల్‌ చేస్తే దగ్గర్లోని పోలీసులు అప్రమత్తం అవుతారు.

* తొందరగా చేరుకోవచ్చు అని రాత్రులు ఇరుకు సందులు, షార్ట్‌ కట్‌ దారులను ఎంచుకోవద్దు. చాలా ప్రమాదకరం. ఒక వేళ ఆటోలో ప్రయాణించాల్సి వస్తే ఆటో నెంబరును ముందుగానే ఫోటో తీసి ఇంట్లో వాళ్లకి పెట్టాలి. అలా చేస్తున్నామని డ్రైవర్‌కి తెలిసేలా చేస్తే ఇంకా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్