Love - Dating: ఇద్దరి మధ్య వయసు తేడా ఉందా..?

ఇప్పుడు కొంతమంది ప్రేమ, పెళ్లికి ముందు డేటింగ్ కూడా అవసరమే అని భావిస్తున్నారు. అయితే డేటింగ్ విషయంలో మిగతా అంశాల మాదిరిగానే ఇద్దరి మధ్య ఉండే వయసు తేడా కూడా తమ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంటుంది. కొన్నిసార్లు ఆ తేడా మరీ ఎక్కువుండే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ఎక్కువ వయసు....

Updated : 26 Jul 2022 22:15 IST

ఇప్పుడు కొంతమంది ప్రేమ, పెళ్లికి ముందు డేటింగ్ కూడా అవసరమే అని భావిస్తున్నారు. అయితే డేటింగ్ విషయంలో మిగతా అంశాల మాదిరిగానే ఇద్దరి మధ్య ఉండే వయసు తేడా కూడా తమ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంటుంది. కొన్నిసార్లు ఆ తేడా మరీ ఎక్కువుండే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ఎక్కువ వయసు తేడాతో డేటింగ్‌లో ఉన్న జంటలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..!

ఆధిపత్యం వద్దు..!

రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరిలో వయసులో పెద్దవాళ్లు ఒక్కోసారి చిన్నవాళ్లపై ఆధిపత్యం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో చిన్నవాళ్లు తమ ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల క్రమంగా తమ మధ్య స్నేహపూర్వక వాతావరణం మసకబారుతుంది. ఇది తమ రిలేషన్‌షిప్‌కు అంత మంచిది కాదు. ఈ క్రమంలో ఒకరికొకరు తమ భావాలను స్వతంత్రంగా వ్యక్తపరచుకోగలిగినప్పుడే ఏ బంధమైనా నిలబడుతుందనే విషయం మర్చిపోకండి.

అర్ధం చేసుకుంటే..

రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరికీ వయసు పరంగా తేడా ఉండడం వల్ల.. వాళ్ల ఆలోచనా విధానం, పరిణతి స్థాయిలలో కూడా తేడా ఉండడం సహజం. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి. ఎందుకంటే ఇద్దరి దృష్టి కోణాలు ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు. అలాంటి పరిస్థితుల్లో నా మాటే నెగ్గాలనే ధోరణిలో కాకుండా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. ఎదుటివాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకొని మెలగాలి.

ఫ్రెండ్స్ విషయంలో..

రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరి మధ్య వయసు తేడా ఉందంటే.. తమ భాగస్వామి స్నేహితులతో కూడా ఆ తేడా ఉన్నట్లే కదా..! ఈ క్రమంలో స్నేహితుల బృందాలతో కలిసి ఎంజాయ్ చేసే క్రమంలో ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉండొచ్చు. ఉదాహరణకు ఒకరికి వీకెండ్‌లో స్నేహితులతో కలిసి ఏదైనా పార్టీకి వెళ్లాలని ఉంటే.. మరొకరికి స్నేహితులతో ఇంట్లోనే కూర్చొని నచ్చిన సినిమాను వీక్షించడం ఇష్టం కావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఒకరి అభిప్రాయాలనే సమర్థించకూడదు. ఈ క్రమంలో ఇద్దరూ ఆలోచించుకొని ఒక అభిప్రాయానికి రావడం మంచిది.

గొడవలు వస్తే ఎలా..?

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఇద్దరి మధ్య గొడవలు రావడం చాలా సహజం. కానీ.. తమ మధ్య వచ్చే అభిప్రాయభేదాలకు వయసు తేడానే కారణమని అనుకోవడం సరి కాదు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అలా ఎందుకు జరిగిందో ఆలోచించి.. మరోసారి అది పునరావృతం కాకుండా చూసుకోండి. అంతేతప్ప గొడవ జరిగిన ప్రతిసారీ వయసు తేడాను నిందించడం సమస్యకు పరిష్కారం కాదు..!

ఆలోచనలు ఒకటే అయితే..

రిలేషన్‌షిప్‌లో ఇద్దరి ఆలోచనా విధానాలు, పాటించే విలువలు.. ఒకేలా ఉన్నప్పుడు వారి మధ్య ఉండే వయసు తేడా అనేది ఎప్పటికీ సమస్యగా కనిపించదు. ఈ క్రమంలో వాళ్లకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని సరైన విధంగా పరిష్కరించుకోగలరు. అంతేకాకుండా భవిష్యత్తు కార్యాచరణపై ఇద్దరూ ముందు జాగ్రత్తతో ఉంటారు. ఏకాభిప్రాయంతో ప్రణాళికాబద్ధంగా తమ జీవితాన్ని నచ్చినట్లుగా, ఆనందంగా గడుపుతుంటారు.

ఆ విషయంలోనూ..

లైంగిక విషయాలకు సంబంధించి మనిషి వయసు చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే మనిషికి ఉండే లైంగిక ఆలోచనలు ఒక్కో వయసులో ఒక్కోలా ఉంటాయి. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ల మధ్య వయసు విషయంలో తేడా ఉన్నప్పుడు.. తమ లైంగిక ఆలోచనల్లో కూడా తేడా ఉండడం సహజం. అందుకే తమ మనసులోని భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరి ఆలోచనల మధ్య సఖ్యత కుదిరినప్పుడు పెళ్లి తర్వాత లైంగిక జీవితం కూడా హాయిగా సాగిపోయే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్