ప్రేమై పొంగెనే...

‘పెళ్లయ్యాక అన్ని సర్దుకుంటాయిలే’ అనుకుంటాం. తీరా పెళ్లయ్యాక చిన్నచిన్న సమస్యలే అనుకున్నవి కాస్తా సంసారం బీటలు వారడానికి కారణం అవుతాయి.

Published : 04 Dec 2022 00:03 IST

‘పెళ్లయ్యాక అన్ని సర్దుకుంటాయిలే’ అనుకుంటాం. తీరా పెళ్లయ్యాక చిన్నచిన్న సమస్యలే అనుకున్నవి కాస్తా సంసారం బీటలు వారడానికి కారణం అవుతాయి. అంతవరకూ వెళ్లకుండా ఉండాలంటే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడానికంటే ముందే అమ్మాయి, అబ్బాయి కొన్ని విషయాల్లో స్పష్టంగా ఉండాలి...

పెళ్లయ్యాక నా జీవితం ఇలా ఉంటుంది అనే సంసిద్ధత ఇటు అమ్మాయికి, అటు అబ్బాయికి కూడా ఉండాలంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌. అలా కాకుండా ప్రతి రోజూ ఒకరినొకరు నిందించుకుంటూ గడిపేది సంసారమే అయినా.. అది సంతోషకరమైంది మాత్రం కాదు అంటారామె. వివాహమంటే జీవితాంతం భాగస్వామి చేయి వదలకుండా నడవడానికి సిద్ధపడటం. అప్పటి వరకు ఎవరికివారు ఒంటరిగా జీవితాన్ని గడిపినా, అక్కడి నుంచి జీవితమంతా ఇద్దరూ కలిసి నడవాలి. ఆ ప్రయాణం సజావుగా సాగాలంటే అవతలి వారేం చెప్పదలుచుకున్నారో పూర్తిగా వినే ఓర్పు, సహనం అలవాటు చేసుకోవాలి.

పెళ్లంటే సంతోషాలు, సంబరాలే కాదు.. మధ్యలో అలకలు, ఎడబాట్లూ కూడా ఉంటాయి. అవి వీలైనంత త్వరగా దూరంగా కావాలంటే భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకముందు మీ సమస్యలను ఎలా ఎదుర్కొనేవారో, అవసరమైతే ఎలా రాజీపడేవారో మరవకూడదు. ఆ పద్ధతినీ అనుసరిస్తూ.. పరిస్థితులకు రాజీ పడటం కూడా పాటించాలి. అంతమాత్రాన మనమేదో తగ్గినట్లు భావించకూడదు. ఎదురుగా ఉన్న జీవితభాగస్వామిని ఓ స్నేహితుడు అనుకొంటే చాలు. మీ సమస్యలు దూదిపింజల్లా తేలిపోతాయి.  జీవితాంతం చేయాల్సిన ప్రయాణం అలసటగా అనిపించదు. భాగస్వామి నోరుతెరిచి చెప్పకపోయినా వాళ్ల అవసరాల్ని గుర్తించి, తీర్చడానికి సిద్ధమవ్వాలి. ఇదే దంపతుల మధ్య అనురాగాన్ని పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్