ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!

నాకు పెళ్లయి పదేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఒకరోజు వేరే అమ్మాయితో మా ఆయన చేసిన వాట్సప్‌ సంభాషణలు చూశా. వాళ్లిద్దరూ పరిధి దాటి మాట్లాడుకోవటం నన్ను చాలా బాధించింది.

Updated : 18 Mar 2024 19:36 IST

నాకు పెళ్లయి పదేళ్లవుతోంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఒకరోజు వేరే అమ్మాయితో మా ఆయన చేసిన వాట్సప్‌ సంభాషణలు చూశా. వాళ్లిద్దరూ పరిధి దాటి మాట్లాడుకోవటం నన్ను చాలా బాధించింది. అడిగితే, నా ఫోన్‌ ఎందుకు చూశావంటూ నన్నే తప్పుపడుతున్నాడు. తన మీద నమ్మకం కలగటం లేదు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయనిపిస్తోంది. ఏం చేయాలో తెలియటం లేదు.

ఓ సోదరి

మీరు పదేళ్లుగా అతనితో కాపురం చేస్తున్నారు. అతని ప్రవర్తనలో మీకు మార్పు ఎప్పటి నుంచి కనిపిస్తోంది? మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలున్నాయా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఆ అనుమానంతోనే మీరు అతడి మొబైల్‌ సంభాషణలు చూశారో లేదా అనుకోకుండా చూశారో తెలియదు. ఒక్కోసారి మన కళ్లతో చూసినవాటినీ అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మరోసారి నిర్ధారించుకోండి. ఒకవేళ  నిజంగానే అతడు తప్పుచేసి బుకాయించడానికీ అలా ప్రవర్తించి ఉండొచ్చు. అలాకాకుండా మీరు అనుమానపడి... అతడిని ప్రశ్నించటం వల్ల మీ మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది. మనసులో అనుమానం ఉంటే బంధం కొనసాగించలేరు. ఇది సున్నితమైన విషయం కాబట్టి తొందర పడకుండా ముందడుగు వేయండి. మీకు నమ్మకమున్న, పెద్దరికంతో సర్దుబాటు చేయగలిగేవారితో మీ భర్తకి చెప్పించండి. మీరు కూడా అతడి బాధ్యతను గుర్తు చేయండి. మారేందుకు కొంత సమయం ఇవ్వండి. అప్పటికీ మార్పు కనిపించకపోతే ఇద్దరూ ఫ్యామిలీ కౌన్సెలర్‌ దగ్గరకు వెళ్లండి. సమస్య ఓ కొలిక్కి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్