ప్రమాదం అంచున పసిమొగ్గలు..!

చిన్న పిల్లలేమో ఫోన్‌ ఇస్తేనే అన్నం తింటామంటారు. టీనేజర్లేమో స్కూల్‌ నుంచి వచ్చీరాగానే మొబైల్‌ పట్టుకుని ఆటల్లో పడిపోతారు. ఫోన్‌ ఇవ్వకుంటే అన్నం తినరేమో... గేమ్స్‌ వద్దంటే ఏడుస్తారేమో... అని తల్లిదండ్రులు భయపడతారు. కానీ మనలోని ఈ భయాలే పిల్లల్ని ఫోన్లకి కట్టుబానిసల్ని చేస్తున్నాయి.

Published : 05 Apr 2024 01:56 IST

చిన్న పిల్లలేమో ఫోన్‌ ఇస్తేనే అన్నం తింటామంటారు. టీనేజర్లేమో స్కూల్‌ నుంచి వచ్చీరాగానే మొబైల్‌ పట్టుకుని ఆటల్లో పడిపోతారు. ఫోన్‌ ఇవ్వకుంటే అన్నం తినరేమో... గేమ్స్‌ వద్దంటే ఏడుస్తారేమో... అని తల్లిదండ్రులు భయపడతారు. కానీ మనలోని ఈ భయాలే పిల్లల్ని ఫోన్లకి కట్టుబానిసల్ని చేస్తున్నాయి. తాజాగా స్మార్ట్‌ పేరెంట్‌ సొల్యూషన్‌ కంపెనీ ‘బాటు టెక్‌’ చేసిన సర్వే ఇదే చెబుతోంది. 5-16ఏళ్ల వయసు పిల్లల్లో 60శాతం మంది అతిగా మొబైళ్లకు అలవాటుపడి నిద్రలేమితో బాధపడుతున్నారని వెల్లడించింది. ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గిపోవడంతోపాటు చదువుల్లోనూ వెనకబడుతున్నారట. మొత్తం వెయ్యిమంది తల్లిదండ్రులను సర్వే చేయగా, వారిలో 85శాతం తల్లిదండ్రులు పిల్లల్ని ఫోన్‌ చూడకుండా ఆపలేకపోతున్నామంటూ వాపోయారట. ఆన్‌లైన్‌ గేములూ, సామాజిక మాధ్యమాల్లో నిరంతరం గడుపుతూ, వారికే తెలియకుండా పిల్లలు అశ్లీల వీడియోల వైపూ మళ్లుతున్నట్లు ఈ సర్వే చెబుతోంది. దీన్ని నివారించాలంటే పేరెంటల్‌ కంట్రోల్‌ ఫీచర్స్‌ని తప్పకుండా వినియోగించుకోవాలి. అనవసర వీడియోలు చూడకుండా కంటెంట్‌ను నియంత్రించాలంటోంది. నిజానికి ఈ ఫీచర్స్‌ను వాడుతోన్న తల్లిదండ్రులు 10శాతం మాత్రమేనట. పిల్లల తెర సమయం తగ్గించి, కంట్రోల్‌ ఫీచర్స్‌ వాడితే వారిని వీటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్