ప్రియమైన కౌగిలింత..!

అమ్మ, నాన్న, భర్త, స్నేహితులు, పిల్లలు... ఇలా మీరు ప్రేమ చూపించేవారు, మీపై ప్రేమ చూపించేవారు వారి మనోభావాలను మనకు అర్థమయ్యేలా చెప్పే మార్గాల్లో కౌగిలింత ఒకటి.

Published : 12 Apr 2024 01:35 IST

మ్మ, నాన్న, భర్త, స్నేహితులు, పిల్లలు... ఇలా మీరు ప్రేమ చూపించేవారు, మీపై ప్రేమ చూపించేవారు వారి మనోభావాలను మనకు అర్థమయ్యేలా చెప్పే మార్గాల్లో కౌగిలింత ఒకటి. వారి స్పర్శ మనకు బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిస్తుంది. ధైర్యం కోల్పోయినప్పుడు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్వీయ కౌగిలింత వల్ల కూడా అదే అనుభూతిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారి అనుభూతులను పరీక్షించగా తమని తాము కౌగిలించుకున్న వారిలోనూ ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలై భయం, ఆందోళనలు తగ్గాయట. అంతేకాదు, మనకి మనం తోడుగా ఉన్నామనే భద్రతా భావనను కలిగించిందట. శరీరంలో కార్టిసాల్‌ విడుదలై ఒత్తిడినీ తగ్గించిందట. మానసిక ప్రశాంతత చేకూర్చిందట. అందుకే మనకు మనమే ఓ హగ్‌ ఇచ్చేసుకుందామా..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్