పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా?

మా అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో నన్నూ అన్నయ్యనీ నానమ్మే పెంచింది. రెండేళ్ల క్రితం అన్నయ్యకు, ఐదేళ్ల కిందట నాకు పెళ్లిళ్లు అయ్యాయి. నాకు వివాహం చేసే ముందు ఎకరం పొలం రాసిస్తాం అని మా అత్తింటివారికి చెప్పారు.

Published : 30 Apr 2024 14:39 IST

మా అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో నన్నూ అన్నయ్యనీ నానమ్మే పెంచింది. రెండేళ్ల క్రితం అన్నయ్యకు, ఐదేళ్ల కిందట నాకు పెళ్లిళ్లు అయ్యాయి. నాకు వివాహం చేసే ముందు ఎకరం పొలం రాసిస్తాం అని మా అత్తింటివారికి చెప్పారు. కానీ, అన్నయ్య నాకు తెలియకుండా మొత్తం ఆస్తులన్నీ తన పేరున రాయించుకున్నాడు. అది తాతల ఆస్తి. ఇందులో నాకు వాటా ఉండదా? పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత పూర్తయినట్లేనా?

ఓ సోదరి

మీకు పొలం మీ నానమ్మ రాసిస్తా అన్నారా? ఆస్తి ఎవరిది? మీ తాతగారి స్వార్జితమా లేక ఆయనకి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందా? హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం, ఒక హిందూ వ్యక్తి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే అతని ఆస్తి తన పిల్లలు, భార్య, తల్లి(క్లాస్‌1 వారసులు)కి సమానంగా చెందుతుంది. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన కూతురు/కొడుకు... సంతానానికి కూడా అందులో వాటా ఉంటుంది. ఇక, మీ అన్నయ్య ఆస్తి మొత్తాన్నీ తన పేరు మీదకు మార్చుకున్నాడంటున్నారు. అది చెల్లదని మీరు క్యాన్సిలేషన్‌ డీడ్‌ కోరుతూ కోర్టులో దావా వేయొచ్చు. ఒకవేళ ఆ ఆస్తి మీ నానమ్మదే అయితే అది ఆవిడకు స్వార్జితం అవుతుంది. దాన్ని ఆవిడ తనకు నచ్చినవారికి ఇవ్వొచ్చు. అలా దాన్ని మీ అన్నయ్య పేరున గిఫ్ట్‌ డీడ్‌/సేల్‌ డీడ్‌ చేసి ఉంటే అది చెల్లుతుంది. పెళ్లి చేసిన తరవాత ఆడపిల్ల బాధ్యత తీరిపోతుందని భావిస్తారు చాలామంది. కానీ, పిత్రార్జితపు ఆస్తిలోనూ, భాగం పంచుకోకుండా ఉన్న ఆస్తిలోనూ ఆడపిల్లలకు పెళ్లయిన తరవాత కూడా హక్కు ఉంటుందని చట్టంతోపాటు సుప్రీంకోర్టు తీర్పులూ చెబుతున్నాయి.  ముందు ఎవరైనా మంచి లాయర్‌ని కలిసి మీ సమస్య వివరించండి. తప్పక పరిష్కారమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్