టిక్‌ టాక్‌ టో ఆడిద్దామా!

సెలవుల్లో పిల్లల్ని కాసేపైనా కుదురుగా ఓ చోట కూర్చోబెట్టాలంటే తల్లులకు కత్తిమీద సామే. మీదీ ఇదే పరిస్థితా? అయితే, వారికి ఈ టిక్‌ టాక్‌ టో గేమ్‌ని పరిచయం చేయండి.

Updated : 06 May 2024 13:19 IST

సెలవుల్లో పిల్లల్ని కాసేపైనా కుదురుగా ఓ చోట కూర్చోబెట్టాలంటే తల్లులకు కత్తిమీద సామే. మీదీ ఇదే పరిస్థితా? అయితే, వారికి ఈ టిక్‌ టాక్‌ టో గేమ్‌ని పరిచయం చేయండి. ఎంచక్కా నీడపట్టునే ఉండి ఆడుకుంటారు. ఇంతకీ ఈ ఆటేంటి అంటారా? ప్రతి అడ్డం, నిలువు వరుసల్లో మూడేసి గడులు, మొత్తంగా చూస్తే తొమ్మిది... వచ్చేలా ఓ చతురస్రాకారపు బాక్సు గీయండి. ఇప్పుడు రెండు రకాల పావులు(రాళ్లు, గాజులు, పూసలు, రంగు బిళ్లలు)ఏవైనా రెండు తీసుకోండి. ఆడే ఇద్దరూ చెరో రకం ఎంచుకోవాలి. ఆపై ఒకరి తరవాత ఒకరు ఒక్కో బాక్సుని ఎంచుకుని తమ దగ్గర ఉన్న ఒక్కో పావునీ పెట్టాలి. అయితే, ఇలా పెట్టేటప్పుడు అవతలివారి మూడూ పావులూ ఒక వరసలో రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే వారే విజేత. ఈ ఆట పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచుతుంది. తక్షణం స్పందించే అలవాటుని నేర్పిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని మార్పులతో దీన్ని ఇంకా చాలా రకాలుగానూ ఆడుకోవచ్చు.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్