పాపం... ప్రేమ కోసమే!

ఇంట్లో కాస్త పెద్దవాళ్లు ఉంటే ఉండే వాతావరణమే వేరు. ఏదైనా మర్చిపోతామేమోనని పదే పదే గుర్తు చేస్తుంటారు. తోచిన సాయమేదో చేయాలనుకుంటారు.

Published : 10 Jun 2024 02:20 IST

ఇంట్లో కాస్త పెద్దవాళ్లు ఉంటే ఉండే వాతావరణమే వేరు. ఏదైనా మర్చిపోతామేమోనని పదే పదే గుర్తు చేస్తుంటారు. తోచిన సాయమేదో చేయాలనుకుంటారు. మనం పనిలో అడ్డుపడుతున్నారని అనుకుంటాం. కానీ... మనతో మాట కలపడానికీ, ప్రేమను చూపడానికీ వాళ్లు చేసే ప్రయత్నమిది. కాబట్టి...

నమేదో హడావుడిలో ఉంటాం. వీళ్లేమో ఈ సలహాలు ఇస్తుంటారు. ఈలోపు ఇంకొకటేదో ఎక్కడ మర్చిపోతామో అని మన భయం. ఆ కోపంలో అరిచేస్తాం. వాళ్లేమో చిన్నబుచ్చుకుంటారు. పాపం వాళ్ల కోణంలో ఆలోచించండి. పనులు, మొబైల్‌ అంటూ మనకు బోలెడు వ్యాపకాలు. మరి వారికో? జ్ఞాపకాలు నెమరేసుకోవడమే ఈ వయసులో వారికి నచ్చిన పని. కాబట్టి, వాళ్లతో రోజూ కొద్దిసేపు మాట కలపండి. చెప్పేవన్నీ వినండి. సాయం చేయాలనుకుంటే చిన్నచిన్నవి అప్పజెప్పండి. సంతోషంగా చేస్తారు. మీకూ బోలెడు విషయాలు తెలుస్తాయి.

  •  సమయానికి భోజనం, దుస్తులు... ఇవికాదు వీళ్లు కోరుకునేది. ఓ చిరునవ్వు, ఆత్మీయ స్పర్శ. మాట్లాడేప్పుడు వాళ్ల చేతుల్ని చేతులోకి తీసుకోవడం, ఆత్మీయ ఆలింగనం... తెలియని భరోసానిస్తాయి. అసలే కాస్త వయసు పైబడ్డాక ముసలి వయసులో ఒంటరి భావన వచ్చేస్తుంది. ఇలా చేస్తూ ఉండండి... అంతకు మించిన ఆనందం కోరుకోరు.
  •  ‘ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతారు’... పదే పదే గుర్తుచేయడం మనకీ చిరాకే. కానీ వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం సర్వసాధారణం. చిన్నచిన్న ఆటలు వాళ్లతో కలిసి ఆడండి. నిర్ణీత వేళలు పెట్టి, అదే సమయానికి భోజనం, మందులు అందివ్వండి. వాళ్లకీ అలవాటు అవుతుంది. మతిమరపూ దరి చేరదు. చిన్న చిన్నవే కదూ... పెద్ద సమయమూ తీసుకోదు. ప్రయత్నిద్దామా మరి... ఈ కొద్దిప్రేమకే పసివాళ్లలా ఎంత సంబరపడతారో!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్