పెన్నులు పోవు... పుస్తకాలు మారిపోవు!

‘అది నా పెన్సిల్‌. ఇమ్మంటే తనదంటున్నాడు’, ‘నా పుస్తకం పోయింది’... స్కూళ్లు మొదలవుతున్నాయి. ఇక రోజూ ఇలాంటి బోలెడు ఫిర్యాదులు మన కోసం ఎదురు చూస్తుంటాయి. పెన్సిల్, పెన్నులు పోగొట్టుకోవడం, స్టేషనరీ వస్తువులు, లంచ్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు మారడం మామూలే.

Published : 12 Jun 2024 01:55 IST

‘అది నా పెన్సిల్‌. ఇమ్మంటే తనదంటున్నాడు’, ‘నా పుస్తకం పోయింది’... స్కూళ్లు మొదలవుతున్నాయి. ఇక రోజూ ఇలాంటి బోలెడు ఫిర్యాదులు మన కోసం ఎదురు చూస్తుంటాయి. పెన్సిల్, పెన్నులు పోగొట్టుకోవడం, స్టేషనరీ వస్తువులు, లంచ్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు మారడం మామూలే. ఇలా జరగొద్దని కొన్నిసార్లు గుర్తులు పెట్టడం, స్కెచ్‌ పెన్నులతో రాయడం వంటివెన్నో చేసినా... కొన్నిసార్లు చెరిగిపోతుంటాయి. ఈ సమస్యలకు ‘స్టిక్కర్‌’తో చెక్‌ పెట్టేయండి. పుస్తకాలు మారిపోకుండా స్టిక్కర్లు అతికిస్తాం కదా! వాటిని పిల్లల పేరు, ఫొటోతో సహా చేయించుకోవచ్చు. పెన్సిళ్లను ఏకంగా పేరుతోనే తయారు చేయించుకోవచ్చు. అంతేనా... స్కేలు, కత్తెర, లంచ్‌ బాక్స్, బ్యాగు, షూ... ఇలా ప్రతిదానికీ మారిపోకుండా వీటిని తయారు చేయించుకోవచ్చు. చిరిగిపోతాయన్న బాధ ఉండదు. వాటర్‌ప్రూఫ్‌వి కాబట్టి తడిచినా సమస్య ఉండదు. ఇవి త్వరగా పోవు కూడా. స్టిక్కర్లు అతికించినట్టుగా కనిపించొద్దంటే ‘ఇంక్‌ ట్రాన్స్‌ఫర్‌ లేబుల్స్‌’ ఎంచుకుంటే సరి. స్టిక్కర్‌ని అతికించి కొద్దిసేపయ్యాక తీసేస్తే... పేరుతో సహా నచ్చిన బొమ్మ ఆ వస్తువుపై లేబుల్‌లా పడిపోతుంది. ‘చాటర్‌బాక్స్‌ లేబుల్స్, పాపప్‌ కిడ్స్, విస్టాప్రింట్‌’ సహా ఎన్నో ఆన్‌లైన్‌ సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. నచ్చితే తెచ్చేసుకోండి. వస్తువులు పోవడం, మారిపోవడం లాంటి సమస్యలే ఉండవు. ఇంకేం... ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్