Published : 07/12/2021 00:50 IST

20ల్లోనే ఆలోచించాలి

రమ్య ఇప్పుడే ఉద్యోగంలోకి అడుగు పెడుతోంది. అయిదారేళ్లు నచ్చినట్లుగా ఉండి, ఆపై భవిష్యత్‌ గురించి ఆలోచిద్దాం అనుకుంటోంది. కానీ 20ల్లోనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే.. జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం తేలికవుతుందనేది నిపుణుల సూచన.

* ఆరోగ్యం.. జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నిండైన ఆరోగ్యం తప్పనిసరి. వ్యాయామంతో శరీరం, ధ్యానంతో మనసూ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే విటమిన్లు, ఖనిజ లవణాలున్న ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. చర్మసౌందర్యాన్నీ ముందు నుంచి కాపాడుకోవాలి. అప్పుడే నలభయ్యోపడిలో చర్మంలో కలిగే మార్పులను ముందే నియంత్రించు కోవచ్చు. తీరా చేయిదాటాక చర్యలు చేపట్టినా ఫలితం పొందడం కష్టమే.

* ఆర్థికంగా.. సంపాదన మొదలైనప్పటి నుంచే మూడోవంతు పొదుపు తప్పనిసరి. బాధ్యతలుంటే వాటికి విడిగా ఓ ఖాతా తెరిచి జమ చేస్తుండాలి. భూమి, బంగారం వంటి వాటిపై పెట్టుబడి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆరోగ్యబీమానూ చిన్నవయసు నుంచే మొదలుపెడితే పాలసీ తక్కువగా ఉంటుంది. అనుకోని ప్రమాదాలు, అనారోగ్యాలకు ఈ పొదుపు రక్షణగా ఉంటుంది.

* మీ కోసం.. మారుతున్న టెక్నాలజీ దృష్ట్యా నిరంతరం నేర్చుకోవడం ఇప్పుడు సాధారణమైంది. ఇప్పటివరకూ అమ్మా నాన్నే వెచ్చించారు కదా! ఇకపై వీటి కోసమూ మీరు కొంత పక్కన పెట్టుకోండి. ఎలాగూ ఉద్యోగం వచ్చిందిగా అన్న ధోరణి వద్దు. కొత్తవాటిపై అవగాహన పెంచుకోవాలి. వంటపైనా దృష్టిపెడితే ఒంటరిగా ఉండాల్సి వస్తే ఉపయోగ పడుతుంది. సమయం లేక పక్కన పడేసిన అభిరుచులపైనా దృష్టిపెట్టండి. వాటిని ప్రయత్నించడానికీ ఇదే సరైన సమయం. స్నేహితులు, బంధువులకు కొంత సమయం కేటాయిస్తుండండి. ఇప్పటి నుంచే దీన్నీ ప్లాన్‌ చేసుకుంటే మంచిది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.