Published : 13/12/2021 01:24 IST

మిమ్మల్ని మీరు విజేతగా...

ఇంటర్వ్యూలో  అడిగిన ప్రశ్నల్లో ఒకటి సునీతను సందిగ్ధంలో పడేసింది. ‘మిమ్మల్ని మీరు విజేతగా భావిస్తున్నారా’ అని అడిగినదానికి అవుననాలా.. కాదనాలా తెలియలేదు. దీనికి ‘అవును’.. అని చెప్పాలంటున్నారు కెరీర్‌ నిపుణులు. అందులో అభ్యర్థి అనుభవంకన్నా ఆత్మవిశ్వాసాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటారని సూచిస్తున్నారు.

* విధుల్లో లక్ష్యాలను చేరినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా విజయం సాధించినట్లే. అలాంటి సందర్భాల్లో గెలిచినట్లుగా మనల్ని మనం పరిగణించుకోవాలి. అది మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది.

* అనుభవాన్ని పొంది, ఉన్నత స్థానానికి వెళ్లే మార్గంలో ఇంటర్వ్యూలకు హాజరైతే ఈ తరహా ప్రశ్నలు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు విజేతగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు వెంటనే అవుననే చెప్పాలి. ‘ఎలా పరిగణించుకుంటున్నారు’ అనే రెండో ప్రశ్నకూ మీ వద్ద సమాధానం ఉండాలి. గత అనుభవం, సాధించిన విజయాలు, గత సంస్థకు మీవల్ల కలిగిన లాభాలు లేదా ప్రయోజనాలు వంటివన్నీ ధైర్యంగా చెప్పగలగాలి...

* ఉద్యోగంలో చేరడానికి అర్హత సాధిస్తే భవిష్యత్తులో సంస్థ అభివృద్ధి కోసం ఏయే అంశాల్లో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలనుకుంటున్నారో కూడా చెప్పాలి. అవతలివారికి మీ అనుభవం, ధైర్యంతోపాటు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా విజయవంతంగా చేయగలరనే నమ్మకాన్ని కలిగిస్తే చాలు. ఇంటర్వ్యూలో మీరు విజయం సాధించినట్లే.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి