అలా తింటోంటే.. ఒత్తిడే!

చైతన్య ఇంటి నుంచి పనిచేస్తోంది. రాత్రి పోద్దుపోయే వరకూ విధులు నిర్వహిస్తోంది. వేళకి భోజనం చేసినా ఆకలి వేయడమో, ఏదో ఒకటి తినాలనో అనిపిస్తోందామెకు. ఇది ఒత్తిడికి సూచనే అంటున్నారు నిపుణులు. దాన్ని తగ్గించుకునే

Updated : 15 Dec 2021 03:33 IST

చైతన్య ఇంటి నుంచి పనిచేస్తోంది. రాత్రి పోద్దుపోయే వరకూ విధులు నిర్వహిస్తోంది. వేళకి భోజనం చేసినా ఆకలి వేయడమో, ఏదో ఒకటి తినాలనో అనిపిస్తోందామెకు. ఇది ఒత్తిడికి సూచనే అంటున్నారు నిపుణులు. దాన్ని తగ్గించుకునే ప్రయత్నంతోపాటు తీసుకునే ఆహారంపైనా దృష్టిపెట్టమంటున్నారు.  

రోజూ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేవరకు ఏం తిన్నారో, ఎంచుకున్న ఆహారం, సమయాలు సహా డైరీలో పొందుపరచాలి. తిన్న పరిమాణాన్నీ నమోదు చేయాలి. ఉదాహరణకు ఉదయం అల్పాహారం 9 గం.కి 3 ఇడ్లీ తిన్నారనుకోండి. దాన్నే స్పష్టంగా రాసిపెట్టాలి. ఆ తర్వాత చేసే పనిపై ఏకాగ్రత ఉందా లేదా అనేదీ రాయాలి. ఏ ఆహారం తింటే ఉల్లాసంగా అనిపిస్తోందో కూడా గమనించుకుని, నోట్‌ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు అనుకోకండి. మీ పని, మూడ్‌పై ఆహారం ఎంతవరకు ప్రభావం చూపుతోందో దీని ద్వారానే తెలుస్తుంది. దాన్నిబట్టి నియంత్రించుకోవడమో, తగిన పరిష్కారాన్ని వెతకడమో చేయొచ్చు.

కడుపు నిండా.. ప్లేటులో నిండుగా ఆహారాన్ని సర్దుకుని టీవీ లేదా ఫోన్‌ చూస్తూ మొత్తం లాగించేసినా, ఆ తర్వాత వెంటనే ఆకలి వేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కడుపు నిండింది కానీ.. మనసు కాదు. కాబట్టి, ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే మనసు కూడా సంతృప్తి చెందుతుంది. దాంతో ఆకలి అనిపించదు.

నియంత్రణ.. ఆకలి వేస్తే కనిపించింది ఏదో ఒకటి అని నోట్లో వేసేసుకోవద్దు. కాసేపు గమనించండి. నిజంగా ఆకలా? ఏం తోచక, కాలక్షేపానికి అలా అనిపిస్తోందో ఆలోచించండి. ముందు గ్లాసు నీటిని తాగి కాసేపు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. తర్వాతా ఆకలి అనిపిస్తే ఆహారాన్ని తీసుకోవచ్చు.

డీహైడ్రేషన్‌.. ఇది మనసు, శక్తిస్థాయులపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, శరీరానికి కావాల్సినంత నీటిని అందించాలి. అలాగే నూనె పదార్థాలు, వేపుళ్లు, జంక్‌ఫుడ్‌ కాకుండా పండ్లు, ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవాలి. వీటివల్ల అధిక బరువు దరిచేరదు. దీంతోపాటు వ్యాయామం, నచ్చిన వ్యాపకాలను ఏర్పరచుకుంటే ఆకలి భావనను దూరంగా ఉంచొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్