మనసునుతేలికపరుస్తాయ్‌!

చిన్న వాటికే చిరాకు, కోపగించుకోవడం... నెలసరి సమయంలో మామూలే! కానీ మిగతా సమయాల్లోనూ ఇలాగే అనిపిస్తోందంటే.. అలసట, ఒత్తిడి కారణమవ్వొచ్చు. అలాంటప్పుడు సువాసనల సాయం తీసుకోండి...

Updated : 21 Dec 2021 05:27 IST

చిన్న వాటికే చిరాకు, కోపగించుకోవడం... నెలసరి సమయంలో మామూలే! కానీ మిగతా సమయాల్లోనూ ఇలాగే అనిపిస్తోందంటే.. అలసట, ఒత్తిడి కారణమవ్వొచ్చు. అలాంటప్పుడు సువాసనల సాయం తీసుకోండి...

* జాస్మిన్‌.. దీన్ని మానసిక సంబంధిత చికిత్సల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వస్త్రంపై కొన్ని చుక్కల జాస్మిన్‌ ఆయిల్‌ను వేసి పడుకునే ముందు దిండుపై ఉంచండి. మనసుకు విశ్రాంతిని కలిగించడమే కాదు.. మంచి నిద్రనీ అందిస్తుంది.

* లావెండర్‌.. మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయి. డిఫ్యూజర్‌, క్యాండిల్‌, ఎండిన పూల రూపాల్లో దొరుకుతున్నాయి. ఏ రూపంలో తెచ్చిపెట్టుకున్నా మంచిదే.

* ఆరెంజ్‌.. దీనిలోని గుణాలు ఒత్తిడిని తగ్గించడంతోపాటు మనసునీ తేలికపరుస్తాయి. కొన్ని చుక్కల ఆరెంజ్‌ ఆయిల్‌ను డిఫ్యూజర్‌లో వేసి ఇంట్లో ఉంచితే సరి.

* గంధం.. ప్రపంచవ్యాప్తంగా సౌందర్య ఉత్పత్తులు, పెర్‌ఫ్యూమ్‌ల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో ఇదీ ఒకటి. పొడిని కొద్దిచుక్కల నీటితో కలిపి ముఖానికి రాస్తే వాసన మనసుని తేలికపరుస్తుంది. దాని గుణాలు చర్మానికి మెరుపునూ తెస్తాయి. కొన్ని చుక్కల నూనెను స్నానం చేసే నీటిలో వేసుకున్నా ఫలితముంటుంది.

* సిడార్‌ వుడ్‌.. దీంతో తయారైన డిఫ్యూజర్లు మార్కెట్‌లో ఉన్నాయి. తెచ్చి పెట్టుకుంటే సరి! దీని సువాసన శరీరానికి హాయినిస్తుంది. ఉద్వేగాన్నీ అదుపులోకి తెస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్