ఉఫ్‌.. ఒత్తిడి మాయం!

కరోనా పుణ్యమా అని మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన పెరిగిపోయాయి. పైగా మనకున్నవి చాలక... ఇంట్లో అందరివీ మనమే భరించాలి. దీనికి విరుగుడుగా కొంతమంది యాంటీ డిప్రెసెంట్లు కూడా

Published : 21 Jan 2022 00:41 IST

రోనా పుణ్యమా అని మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన పెరిగిపోయాయి. పైగా మనకున్నవి చాలక... ఇంట్లో అందరివీ మనమే భరించాలి. దీనికి విరుగుడుగా కొంతమంది యాంటీ డిప్రెసెంట్లు కూడా వాడుతున్నారు. కానీ మందుల కన్నా బాగా పని చేసే చిట్కాలున్నాయని పరిశోధకులంటున్నారు...

సానుకూలత పంచండి: మీరు వింటారా, చెబుతారా అన్న దాంతో నిమిత్తం లేకుండా మంచి మాటలు మీకూ మంచే చేస్తాయంటున్నారు అమెరికాలో జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. సానుకూలత నిండిన మాటలు, సందేశాలు స్ట్రెస్‌ హార్మోన్ల విడుదలను తగ్గించేస్తాయట. మీరు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ స్నేహితులకో, బంధువులకో ఒక మంచి మెసేజ్‌ ఎంపిక చేసుకుని, పంపి చూడమంటున్నారు వాళ్లు.

పది నిమిషాల వ్యాయామం: మీకు నచ్చిన పాటలో, సంగీతమో పెట్టండి. అది వింటూ నడుముకు ఇరువైపులా చేతులు పెట్టి వెనక్కి ఎంత వంగగలరో అంతా వంగే ప్రయత్నం చేయండి. లేదా ముందుకు వంగి బొటనవేళ్లు అందుకోండి. ఇలా చేస్తే మీ ఆందోళన 65 శాతం తగ్గిపోతుందని బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా శరీరంలోని పెద్ద కండరాలకు తగిన వ్యాయామం అంది భావోద్వేగాలను అదుపు చేసే ఎండోర్ఫిన్స్‌ విడుదల అవుతుంది. అదే సమయంలో సంగీతాన్ని వినడం వల్ల మెదడు విడుదల చేసే ఆల్ఫా తరంగాలు పెరిగి ప్రశాంతత లభిస్తుందట. నాడీ వ్యవస్థను స్థిమిత పరిచే కెరోటినాయిడ్స్‌ దుంప కూరల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ రెండు కప్పుల దుంపల్ని తింటే మీ ఆందోళనలో 55 శాతం తగ్గిపోతుందని యేల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్