మనసు సిద్ధమైతే!

పెళ్లి తర్వాత ఊరు మారడం, పిల్లలు, పెద్దల బాగోగులు, ఇతర బాధ్యతలు.. కారణం ఏదైనా ప్రభావం మాత్రం మన కెరియర్‌పైనే! కొన్నేళ్లయ్యాక మళ్లీ కొనసాగించాలంటే ఏదో సంశయం, భయం. వాటినుంచి

Updated : 26 Mar 2022 03:33 IST

పెళ్లి తర్వాత ఊరు మారడం, పిల్లలు, పెద్దల బాగోగులు, ఇతర బాధ్యతలు.. కారణం ఏదైనా ప్రభావం మాత్రం మన కెరియర్‌పైనే! కొన్నేళ్లయ్యాక మళ్లీ కొనసాగించాలంటే ఏదో సంశయం, భయం. వాటినుంచి తప్పించుకోవాలంటే ముందు మనసును సిద్ధం చేసుకోవా లంటున్నారు నిపుణులు.

* విరామం తర్వాత ఆత్మ విశ్వాసం తగ్గడం సహజమే. దీనికి తోడు వెంటనే తిరస్కరణ ఎదురైతే డీలా పడతారు. కాబట్టి, మీ రంగంలో స్నేహితులతో మాట్లాడి, పని తీరును, కొత్త ధోరణులనూ తెలుసుకోండి.ముందే స్నేహితులకో, సంస్థలకో దరఖాస్తు పంపెయ్యకండి.

* సంస్థలు కోరుతున్న ఉద్యోగార్హతలు, నైపుణ్యాలను పరిశోధించండి. ఎక్కువగా అడుగుతున్నవి జాబితా రాసుకోండి. వాటిలో మీకు ఉన్నవీ, లేనివీ గుర్తించండి. మీ నైపుణ్యాలను పరీక్షించుకోండి. ఏవైనా మర్చిపోయినా కంగారొద్దు. రీస్కిల్లింగ్‌.. ఇప్పుడు ట్రెండ్‌ కూడా. పూర్తిగా మర్చిపోవడం ఉండదు కాబట్టి, త్వరగానే నేర్చుకోగలరు. తర్వాత కొత్తవాటిపై దృష్టి పెడితే సరి!

* సంస్థ వాతావరణం నుంచి ఇంటర్వ్యూ, క్లయింట్లతో మెలిగే తీరు వరకు అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అదీ ఆన్‌లైన్లోనే. దాన్ని ఉపయోగించుకోవచ్చు. చివరగా.. నిజంగా సమయాన్ని కేటాయించగలరా అన్నదీ పరిశీలించుకోండి. పనివేళలు, ఇంటి బాధ్యతల సమన్వయం మొదలైనవి ప్రయోగాత్మకంగా పరిశీలించుకోండి. సాధ్యమే అనిపించాకే ముందడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్